ఆదివారం 07 జూన్ 2020
Business - Apr 02, 2020 , 21:16:59

సామాన్యుల‌కు మ‌రో ఉప‌శ‌మ‌నం

సామాన్యుల‌కు మ‌రో ఉప‌శ‌మ‌నం

ఢిల్లీ: సామాన్యుల‌కు మ‌రో ఊర‌ట నిచ్చే విష‌యం చెప్పింది కేంద్ర ప్ర‌భుత్వం. లాక్‌డౌన్ నేప‌థ్యంలో సామాన్యుల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో పాటు ఆర్బీఐ కూడా ప‌లు నిర్ణ‌యాలు తీసుకుంటున్నాయి. ఇప్ప‌టికే  ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్స్, విద్యుత్ బిల్లులు, ఇంటి ప‌న్నులు ఇలా ప‌లు అంశాల్లో  మిన‌హాయింపులు ఇచ్చాయి. అయితే ఆ జాబితాలో వెహికిల్, హెల్త్ ఇన్సూరెన్స్ చెల్లింపుల‌ గ‌డువును కూడా పొడ‌గించింది ప్ర‌భుత్వం. ఈ నెల 21 వ‌ర‌కూ పొడ‌గిస్తున్న‌ట్లు కేంద్రం ప్ర‌క‌టించింది. మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 వ‌ర‌కు ఉన్న ఇన్సూరెన్స్‌లు రెన్యూవ‌ల్ చేసుకోవాల్సిన వారు ఏప్రిల్ 21 లోగా చెల్లించుకోవ‌చ్చ‌ని తెలిపింది.


logo