తక్కువ ధరకే బంగారం కొనే అవకాశం

ముంబై : బంగారం ధరలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. గత వారం, పదిరోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు రానున్న రెండు నెలల్లో మరింత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. మే నెల వరకు మూఢాలు ఉండటంతో బంగారానికి డిమాండ్ తగ్గిపోనున్నది. ఫలితంగా రానున్న రోజుల్లో పసిడి ధరలు మరింత పతనమవుతాయని నిపుణులు చెప్తున్నారు. కాగా, రేపటి నుంచి చౌక ధరలకే బంగారం కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అవకాశం కల్పిస్తున్నది. సోమవారం నుంచి అందుబాటులోకి రానున్న సావరిన్ గోల్డ్ బాండ్ పథకంలో పెట్టుబుడులు పెట్టి భారీగా లాభాలు పొందేందుకు కేంద్ర ప్రభుత్వం వీలు కల్పిస్తున్నది. ఈ పథకం రేపటి నుంచి ఐదు రోజులపాటు అందుబాటులో ఉంటుంది. ఈ సిరీస్ సావరిన్ గోల్డ్ బాండ్ పథకానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 1 గ్రాము బంగారం ధరను రూ.5,104 గా నిర్ణయించింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని డిజిటల్ చెల్లింపులు జరిపే వారికి గ్రాముకు రూ.50 తగ్గింపు కూడా లభించనున్నది.
సావరిన్ గోల్డ్ బాండ్ పథకం ద్వారా ఏ భారతీయ పౌరుడైనా బంగారు యూనిట్లను కొనుగోలు చేయవచ్చు. ఒక యూనిట్ విలువను ఒక గ్రాముగా వెలకడతారు. ఒక వ్యక్తి ఆర్థిక సంవత్సరంలో కనీస విలువ 1 గ్రాము.. గరిష్టంగా 4 కిలోల బాండ్లను కొనుగోలు చేయవచ్చు. ట్రస్ట్ కోసం అయితే గరిష్ట కొనుగోలు పరిమితిని 20 కిలోలుగా నిర్ణయించారు.
ఇష్యూ ధరపై 2.50 శాతం వడ్డీ
సావరిన్ బంగారు బాండ్లు ప్రతి సంవత్సరం ఇష్యూ ధరపై 2.50 శాతం స్థిర వడ్డీని సంపాదిస్తాయి. ఈ డబ్బు ప్రతి 6 నెలలకు ఆటోమేటిక్‌గా ఖాతాలో జమ అవుతుంది. భౌతిక బంగారంపై ఇలాంటి ప్రయోజనం లభించదు. బాండ్ 8 సంవత్సరాలపాటు కొనసాగుతుంది. అయితే, పెట్టుబడిదారులకు ఐదేండ్ల తర్వాత నిష్క్రమించే అవకాశం లభిస్తుంది. అవసరమైతే ఐదేండ్ల తర్వాత నగదు చేసుకోవచ్చు. ఎన్ఎస్ఈ ప్రకారం, ఈ సావరిన్ గోల్డ్ బాండ్లను రుణాలు తీసుకునేటప్పుడు కొలెటారల్గా పెట్టేందుకు ఉపయోగించకోవచ్చు. ఇది కాకుండా, ఈ బాండ్లు కూడా ఎన్ఎస్ఈలో ట్రేడ్ చేసుకోవచ్చు. బంగారు బాండ్ మ్యాచురిటీపై క్యాపిటల్ లాభం ఉంటే, దానికి మినహాయింపు ఉంటుంది.
99.9 శాతం స్వచ్ఛమైన బంగారం
బంగారు ఈటీఎఫ్‌లు పారదర్శకమైన, ఏకరీతి ధరలను కలిగి ఉంటాయి. ఇది విలువైన లోహాలకు లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్‌ను అనుసరిస్తుంది. అదే సమయంలో, భౌతిక బంగారం యొక్క వివిధ అమ్మకందారులు / ఆభరణాలను వేర్వేరు ధరలకు ఇవ్వవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి కొనుగోలు చేసిన బంగారం 99.9 శాతం స్వచ్ఛత హామీ ఇవ్వబడుతుంది.
ఈ బాండ్లతో ప్రయోజనాలేంటి..?
ఈ మాదిరి బాండ్లతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. రుణం తీసుకోవడానికి సెక్యూరిటీగా ఉపయోగించవచ్చు. కాలక్రమంగా బంగారం ధర పెరుగుదల ప్రయోజనం లభిస్తుంది. దానిపై సంవత్సరానికి 2.5 శాతం వడ్డీ కూడా ఉంటుంది. ఇది ప్రతి ఆరునెలలకు ఒకసారి బ్యాంకు ఖాతాలో జమ చేయబడుతుంది. బాండ్ నుంచి వచ్చే వడ్డీపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కానీ దాని అమ్మకం వల్ల వచ్చే క్యాపిటల్ లాభాలకు పన్ను ఉండదు.
9 నెలల్లో ధరలో 10 శాతం పెరుగుదల
2020 ఏప్రిల్ 20 నుంచి ఈ సావరిన్ గోల్డ్ బాండ్ పథకం ప్రారంభమైంది. మొదటి సీజన్ ఏప్రిల్ 20 నుంచి 24 వరకు కొనసాగగా.. అప్పుడు 1 గ్రాము ధర రూ.4,639 గా నిర్ణయించబడింది. ఇప్పుడు 10 వీ సిరీస్‌కు దాని ధర గ్రాముకు రూ.5,014 గా నిర్ణయించారు. అంటే 2020 ఏప్రిల్ 20 నుండి ఇప్పటి వరకు దాని ధర 10 శాతం కన్నా ఎక్కువ పెరిగింది. దీని ప్రకారం, ఏప్రిల్‌లో పెట్టుబడి పెట్టిన వ్యక్తులు సంవత్సరంలోపు స్థిర డిపాజిట్ల కంటే ఎక్కువ పొందవచ్చు.
బాండ్ల కొనుగోలు ఎక్కడ?
సావరిన్ గోల్డ్ బాండ్ పథకంలో బాండ్లను వాణిజ్య బ్యాంకులు, పోస్టాఫీసులు, స్టాక్ ఎక్స్ఛేంజీలు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ల నుంచి కొనుగోలు చేయవచ్చు. వీటిని భారతీయ పౌరులు, అవిభక్త హిందూ కుటుంబాలు (హెచ్యుఎఫ్), ట్రస్టులు, విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు కొనుగోలు చేయవచ్చు. ఈ పథకంలో కనీసం ఒక గ్రాము బంగారం ధరతో సమానమైన బాండ్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
దేశంలో భౌతికంగా ఉండే బంగారం కొనుగోలు చేయాలనే డిమాండ్‌ను తగ్గించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2015 నవంబర్‌లో ఈ పథకాన్ని ప్రారంభించింది. సావరిన్ గోల్డ్ బాండ్ ప్రభుత్వ బాండ్. దీన్ని డీమాట్ రూపంలో కూడా మార్చవచ్చు. దీని విలువ రూపాయిలు లేదా డాలర్లలో కాకుండా బంగారం బరువులో ఉంటుంది. బాండ్ ఐదు గ్రాముల బంగారం అయితే, ఐదు గ్రాముల బంగారం ధర బాండ్ ధరతో సమానంగా ఉంటుంది. దీన్ని కొనడానికి సెబీ అధీకృత బ్రోకర్ ఇష్యూ ధరను చెల్లించాలి. బాండ్‌ను రీడీమ్ చేసే సమయంలో డబ్బు పెట్టుబడిదారుల ఖాతాలో జమ అవుతుంది. ఈ బాండ్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జారీ చేస్తుంది.
ఇవి కూడా చదవండి..
బాలాకోట్‌లో సర్జికల్ స్ట్రైక్స్ నిజమే!
20 ఏండ్ల తర్వాత తొలిసారి మంచే మంచు!
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- వ్యాపారుల కోసం రూపే సాఫ్ట్ పీఓఎస్
- రైడింగ్ మోడ్స్‌తో సరికొత్త అపాచీ
- సీఐఐ తెలంగాణ చైర్మన్‌గా సమీర్ గోయల్
- మొక్కను తొలగించిన ఇద్దరికి జరిమానా
- టీవీ ధరలకు రెక్కలు!
- పంత్ పవర్
- ముత్తూట్ చైర్మన్ కన్నుమూత
- సెహ్వాగ్ 35 బంతుల్లో 80 నాటౌట్
- మంత్రి కొప్పులను కలిసిన గద్దర్
- ఈ-కొలి బ్యాక్టీరియాతో క్యాన్సర్..!