మంగళవారం 01 డిసెంబర్ 2020
Business - Oct 23, 2020 , 02:16:01

ఫోర్బ్స్‌ జాబితాలో ఎన్టీపీసీ టాప్‌

ఫోర్బ్స్‌  జాబితాలో ఎన్టీపీసీ టాప్‌

  • భారత పీఎస్‌యూల్లో అత్యుత్తమం 

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజ విద్యుత్‌ సంస్థ ఎన్టీపీసీ (నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌) మరో విశిష్ఠ ఘనత సాధించింది. ప్రముఖ పత్రిక ఫోర్బ్స్‌ ఈ ఏడాది ప్రపంచంలోని అత్యత్తమ కంపెనీలతో రూపొందించిన జాబితాలో చోటు దక్కించుకున్న భారత ప్రభుత్వ రంగ కంపెనీ (పీఎస్‌యూ)ల్లో ఎన్టీపీసీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నది. ఈ విషయాన్ని స్వయంగా ఎన్టీపీసీయే వెల్లడించింది. ఉత్తమ పద్ధతులను అమలు చేయడంలో తమకు గల నిబద్ధతకు ఈ గుర్తింపే నిదర్శనమని ఎన్టీపీసీ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.