శనివారం 06 జూన్ 2020
Business - Apr 02, 2020 , 22:58:12

పీఎం-కేర్స్‌ ఫండ్‌కు ఎన్టీపీసీ రూ.257 కోట్లు

పీఎం-కేర్స్‌ ఫండ్‌కు ఎన్టీపీసీ రూ.257 కోట్లు

-రూ.150 కోట్లిచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 2: ప్రభుత్వ రంగ విద్యుదుత్పాదక దిగ్గజం ఎన్టీపీసీ పీఎం-కేర్స్‌ ఫండ్‌కు రూ.257.5 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. కరోనా వైరస్‌పై పోరులో భాగంగా గురువారం ఈ భారీ నిధులను కేంద్ర ప్రభుత్వానికి అందజేయాలని నిర్ణయించింది. రూ.250 కోట్లు ఎన్టీపీసీ ఇస్తుండగా, సంస్థ ఉద్యోగులంతా కలిసి తమ ఒకరోజు వేతనాన్ని సాయం చేశారు. ఇది రూ.7.5 కోట్లుగా ఉన్నది. కాగా, రూ.11 కోట్లతో వివిధ ప్రాంతాల్లో సహాయక చర్యలను చేపడుతున్నట్లు ఎన్టీపీసీ తెలిపింది. ఇప్పటికే తమ దవాఖానలను కరోనా రోగులకు చికిత్స కోసం వాడుకోవచ్చని ఎన్టీపీసీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్‌ పీఎం-కేర్స్‌ ఫండ్‌కు రూ.150 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. కరోనా వైరస్‌ కట్టడికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సహాయంగా ఈ నిధులను ఇస్తున్నట్లు తెలిపింది.


్ర


logo