గురువారం 04 మార్చి 2021
Business - Feb 05, 2021 , 01:30:47

ఎన్‌టీపీసీ మధ్యంతర డివిడెండ్‌ రూ. 3

ఎన్‌టీపీసీ మధ్యంతర డివిడెండ్‌ రూ. 3

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: విద్యుత్‌ ఉత్పత్తిలో అగ్రగామి సంస్థయైన ఎన్‌టీపీసీ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్‌తో  ముగిసిన మూడు నెలలకాలానికిగాను సంస్థ రూ.3,876.36 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని గడించింది. 2019-20 ఏడాది ఇదే సమయంలో ఆర్జించిన రూ.3,351.28 కోట్లతో పోలిస్తే 16 శాతం అధికం ఇది. సమీక్షకాలంలో కంపెనీ  రూ.27,120.35 కోట్ల నుంచి రూ.28,387.27 కోట్ల ఆదాయాన్ని గడించింది. ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా గురువారం సమావేశమైన కంపెనీ బోర్డు..రూ.10 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.3 లేదా 30 శాతం మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ప్రస్తుతం సంస్థ 63 వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నది. 

VIDEOS

logo