గురువారం 04 జూన్ 2020
Business - Apr 14, 2020 , 00:03:45

ఎన్‌ఎస్‌ఈ విరాళం 26 కోట్లు

ఎన్‌ఎస్‌ఈ విరాళం 26 కోట్లు

ముంబై, ఏప్రిల్‌ 13: దేశంలో అతిపెద్ద స్టాక్‌ ఎక్సేంజ్‌ ఎన్‌ఎస్‌ఈ..కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తమవంతుగా రూ.26 కోట్ల భారీ సహాయం ప్రకటించింది. ఈ నిధులను ప్రధానమంత్రి సహాయ నిధికి అందచేస్తున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. వీటితోపాటు ఎస్‌ఎన్‌ఈ ఉద్యోగులు తమ ఒక రోజు వేతనాన్ని అదనంగా అందిస్తున్నారు. మరోవైపు పిడిలిటీ ఇండస్ట్రీస్‌ రూ.25 కోట్లను రిలీఫ్‌ ఫండ్‌కు అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిధిని కేంద్ర, పలు రాష్ట్ర ప్రభుత్వాలకు అందచేస్తున్నట్లు కంపెనీ ఎండీ భారత్‌ పూరి తెలిపారు. అలాగే కన్సాయి నెరోలాక్‌ కూడా ప్రధాని సహాయ నిధికి రూ.4 కోట్ల విరాళాన్ని అందిస్తున్నట్లు తెలిపింది.

సుందర్‌ పిచాయ్‌ రూ.5 కోట్లు

గూగుల్‌ చీఫ్‌ సుందార్‌ పిచాయ్‌ కూడా రూ.5 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రోజువారి కార్మికులకు ఆర్థికంగా ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశంతో ‘గివ్‌ ఇండియా’కు ఈ విరాళం అందచేసినట్లు ట్విట్టర్‌ ద్వారా పిచాయ్‌ వెల్లడించారు. 


logo