సోమవారం 08 మార్చి 2021
Business - Feb 18, 2021 , 01:54:49

అమ్మకాల ఒత్తిడి

అమ్మకాల ఒత్తిడి

  • భారీగా నష్టపోయిన స్టాక్‌ మార్కెట్లు

ముంబై, ఫిబ్రవరి 17: అమ్మకాల ఒత్తిడితో స్టాక్‌ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలతో వరుసగా రెండో రోజు సూచీలు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయి. ఐటీ, ఫైనాన్స్‌, ఎఫ్‌ఎంసీజీ రంగ షేర్లు ప్రాఫిట్‌ బుకింగ్‌కు జరుగడంతోపాటు రూపాయి పతనం కూడా పెట్టుబడిదారుల్లో సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఫలితంగా నష్టాల్లో ప్రారంభమైన సూచీలు చివరికి 52 వేల దిగువకు పడిపోయింది.  మార్కెట్‌ ముగిసే సమయానికి 30 షేర్ల ఇండెక్స్‌ సూచీ సెన్సెక్స్‌ 400.34 పాయింట్లు తగ్గి 51,703.83 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ నిఫ్టీ 104.55 పాయింట్లు పతనం చెంది 15,208.90 వద్ద స్థిరపడింది. 

నష్టపోయిన షేర్లు:

నెస్లె, బజాజ్‌ ఫిన్‌, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, మారుతి, డాక్టర్‌ రెడ్డీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్‌ బ్యాంక్‌, సన్‌ఫార్మా, ఓఎన్‌జీసీ, హెచ్‌యూఎల్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, బజాజ్‌ ఫిన్‌, టైటాన్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఐటీసీ, ఎల్‌అండ్‌టీ

VIDEOS

logo