న్యూఢిల్లీ: నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్)లో సభ్యులుగా చేరాలని భావించే వారికి శుభవార్త.. ఎన్‌పీఎస్‌లో సభ్యులుగా చేరేవారి గరిష్ఠ వయస్సును 65 ఏండ్ల నుంచి 70 ఏండ్లకు పెంచాలని ది పెన్షన్ ఫండ్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అధారిటీ (పీఎఫ్ఆర్డీఏ) ప్రతిపాదించింది.
60 ఏండ్ల తర్వాత ఎన్‌పీఎస్‌లో సబ్స్క్రైబర్లుగా చేరేవారు తమ ఖాతాలను 75 ఏండ్ల వరకు పొడిగించాలని కూడా పీఎఫ్ఆర్డీఏ తన తాజా ప్రతిపాదనల్లో పేర్కొంది. ఇతర సబ్స్క్రైబర్ల మెచ్యూరిటీ వయస్సు గరిష్ఠంగా 70 ఏండ్లుగా నిర్ణయించింది.
అలాగే, ఎన్‌పీఎస్‌లో సభ్యులైన వారికి కనీస పెన్షన్ హామీ కల్పించాలని కూడా పెన్షన్ ఫండ్స్ రెగ్యులేటర్ ప్రతిపాదించింది. ఎన్పీఎస్ పెన్షన్ ఫండ్స్ పర్ఫార్మెన్స్ మీద పెన్షన్ ఆధార పడి ఉంటుంది. గత మూడున్నరేండ్లలో 60 ఏండ్లు దాటిన వారిలో సుమారు 15 వేల మంది ఎన్‌పీఎస్‌లో చేరారని పీఎఫ్ఆర్డీఏ చైర్మన్ సుప్రతీమ్ బందోపాధ్యాయ గురువారం మీడియాతో చెప్పారు.
అందువల్లే ఎన్‌పీఎస్‌లో సభ్యులుగా చేరేందుకు గరిష్ఠ గడువును పొడిగించామని బందోపాధ్యాయ అన్నారు. ఇక ముందు కూడా గరిష్ఠ వయో పరిమితి పెంపు అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామన్నారు.
పెన్షన్ ఫండ్ మేనేజర్లకు లైసెన్సింగ్ ప్రక్రియ ఇటీవలే ముగిసింది. వచ్చే 45 రోజుల్లో నూతన దరఖాస్తు దారుల అనుభవం ఆధారంగా న్యూ విండోను తెరుస్తామని బందోపాధ్యాయ తెలిపారు. ప్రస్తుతం యాక్సిస్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి లైసెన్స్ రెన్యూవల్ చేశామన్నారు.
ఆదిత్య బిర్లా సన్ లైఫ్, కొటక్ పెన్షన్ ఫండ్ సంస్థలు నియంత్రణ సంస్థల నిబంధనలను పూర్తి చేయాల్సి ఉందని బంధోపాద్యాయ్ పేర్కొన్నారు. ఉద్యోగులు తమ పెన్షన్ నిధి నుంచి రూ.5 లక్షల వరకు విత్ డ్రా చేసుకునే ప్రతిపాదనను పరిశీలిస్తున్నదన్నారు. ఇప్పటికైతే రూ.2 లక్షల వరకు విత్ డ్రా చేసుకోవచ్చు.
పెన్షన్ నిధి నుంచి విత్ డ్రాయల్స్‌పై 40 శాతం వరకు పన్ను, మిగతా 60 శాతం వరకు పన్ను రాయితీ ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎన్‌పీఎస్‌లో 10 లక్షల మంది సబ్స్క్రైబర్లను చేర్చుకోవాలని పీఎఫ్ఆర్డీఏ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో ఆరు లక్షల మంది సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు.
పెట్రో సెగలతో ధరల మంట
కొవిడ్‌పై పోరు.. ఫ్రీగా ఆక్సిజన్ పంపిస్తున్న ముకేశ్ అంబానీ
‘మోటో’లవర్స్ కి గుడ్ న్యూస్
ఆర్బీఐ అలర్ట్.. ఈ నెల 18న నిలిచిపోనున్న ఆర్టీజీఎస్ సేవలు
మార్కెట్లోకి హైబ్రిడ్ ట్రాక్టర్
వాట్సాప్‌లో ఈ ట్రిక్స్ తెలుసా?
బైడెన్ ఎఫెక్ట్ : భారత టెక్, ఫార్మా కంపెనీలపై పన్ను భారం
15 నెలల్లో ఈ ఐఐటీయన్ సంపదెంతంటే!
ఫ్లిప్‌కార్ట్ చేతికి క్లియర్ ట్రిప్