శనివారం 27 ఫిబ్రవరి 2021
Business - Dec 31, 2020 , 01:18:17

ఆన్‌లైన్‌లోనూ ఎన్‌పీఎస్‌ నిష్క్రమణ

ఆన్‌లైన్‌లోనూ ఎన్‌పీఎస్‌ నిష్క్రమణ

చందాదారులకు పీఎఫ్‌ఆర్డీఏ వెసులుబాటు

న్యూఢిల్లీ: నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ (ఎన్‌పీఎస్‌) నుంచి చందాదారులు ఇకపై ఆన్‌లైన్‌ విధానం ద్వారా కూడా నిష్క్రమించవచ్చని పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (పీఎఫ్‌ఆర్డీఏ) బుధవారం ప్రకటించింది. ప్రస్తుతం చందాదారులు ఎన్‌పీఎస్‌ నుంచి వైదొలుగాలంటే తమ పాయింట్స్‌ ఆఫ్‌ ప్రజెన్స్‌ (పీవోపీ)ల వద్దకు వ్యక్తిగతంగా వెళ్లి పని పూర్తి చేసుకోవాల్సి వస్తున్నది. ఇతర డాక్యుమెంట్లతోపాటు ఎన్‌పీఎస్‌ ఉపసంహరణ పత్రాలనూ సమర్పించాల్సిన అవసరం ఉంటున్నది. ఇదంతా ఆఫ్‌లైన్‌ పద్ధతిలోనే జరుగుతున్నది. అయితే ఇప్పుడు ఈ పద్ధతితోపాటు ఆన్‌లైన్‌లోనూ ఎన్‌పీఎస్‌ నిష్క్రమణ ప్రక్రియను చందాదారులు పూర్తి చేసుకోవచ్చని ఓ ప్రకటనలో పీఎఫ్‌ఆర్డీఏ వెల్లడించింది. ఓటీపీ/ఈ-సైన్‌ వినియోగం ద్వారా చందాదారులు తమ విత్‌డ్రాయల్‌ డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చని తెలియజేసింది. అయితే ఈ ప్రక్రియ కూడా పీవోపీలకు అనుసంధానంగానే జరుగుతుందని, కానీ ఇదంతా ఎక్కడి నుంచైనా ఆన్‌లైన్‌లోనే చేసుకోవచ్చని పీఎఫ్‌ఆర్డీఏ స్పష్టం చేసింది. ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ విత్‌డ్రాయల్‌ ప్రక్రియకుగాను చందాదారులు కనిష్ఠంగా రూ.125, గరిష్ఠంగా రూ.500 వరకు చెల్లించాల్సి ఉంటుందని పీఎఫ్‌ఆర్డీఏ తెలిపింది. అలాగే చందాదారుల కార్పస్‌ ఫండ్‌లో పీవోపీలకు ప్రోత్సాహక రూపంలో ఫీజుగా 0.125 శాతం అందుతుందని పేర్కొన్నది.

VIDEOS

logo