Bit Coin Vochers | క్రిప్టో కరెన్సీలతో పిజ్జాలు, ఐస్‌క్రీం కొనుక్కోవచ్చు. కాఫీ సేవించొచ్చు.. ఎస్ ఇది నిజం. భారత్‌లోని బిట్ కాయిన్, ఇతర క్రిప్టో కరెన్సీల యూజర్ల కోసం క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ అండ్ వాలెట్ యూనోకార్న్ స్పెషల్ గిఫ్ట్ ఇస్తున్నది. బిట్ కాయిన్ సాయంతో ఇండియన్ క్రిప్టో యూజర్లు పిజ్జా, కాఫీ.. ఐస్‌క్రీం వంటి వినియోగ వస్తువులు కొనుగోలు చేయొచ్చు. నగదుకు బదులు డిజిటల్ కాయిన్ చెల్లించొచ్చు.
ప్రపంచవ్యాప్తంగా బిట్ కాయిన్ యూజర్లు క్రిప్టో కరెన్సీల ట్రేడింగ్‌ను మార్పిడి ఆస్తిగా ఆమోదిస్తున్నారు. కానీ భారత్‌లో అలా జరుగడం లేదు. ఈ నేపథ్యంలో ఇండియన్ క్రిప్టో యూజర్లలో అవగాహన కల్పించాలని నిర్ణయించామని యూనోకాయిన్ సీఈవో కం కో ఫౌండర్ సత్విక్ విశ్వనాథ్ చెప్పారు.
బిట్ కాయిన్ యూజర్లు తొలుత వోచర్లు కొనుగోలు చేయాలి. ఇందుకోసం రూ.100 నుంచి రూ.5000 వరకు గల బిట్ కాయిన్ ఓచర్లను యూనోకాయిన్ అందజేస్తుంది. వీటితో వస్తువులు కొనుగోలు చేయొచ్చు. 90 బ్రాండ్ల వస్తువుల వరకు బేరం చేయొచ్చు. డొమినోస్ పిజ్జా, కేఫ్ కాఫీ డే, బాస్కిన్ రోబిన్స్, హిమాలయ, ప్రిస్టేజ్ తదితర బ్రాండ్ల వస్తువులు కొనుగోలు చేయొచ్చు. అయితే నో యువర్ కస్టమర్ (కేవైసీ) ధ్రువీక్రుత కస్టమర్లకు మాత్రమే క్రిప్టో కరెన్సీలతో కన్జూమర్ ఐటమ్స్ కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది.
యూనోకాయిన్ యాప్‌లోకి వెళ్లి బీటీసీ పేజీ తెరిచి, మోర్ సెక్షన్లో షాప్ అనే బటన్ నొక్కాలి. అప్పుడు ఆయా ఓచర్ల ధరకు అనుగుణంగా అందుబాటులో ఉన్న బ్రాండ్ల జాబితాలో తమకు ఇష్టమైన బ్రాండ్ ఎంచుకోవాలి. బ్రాండ్ ఎంపిక చేసిన తర్వాత వోచర్లను యూనోకాయిన్ యాప్‌పై రూపాయల డినామినేషన్లో డిస్ ప్లే చేయాలి. ఆ వెంటనే యూజర్ క్రిప్టో కాయిన్ వాలెట్ నుంచి నగదు డిడక్ట్ అవుతుంది.
దీని తర్వాత సదరు యూజర్‌కు వోచర్ కోడ్ పంపుతారు. దాని ఆధారంగా క్రిప్టో యూజర్లు కన్జూమర్ ఐటమ్స్ కూడా కొనవచ్చు. ఈ-వోచర్లు గిఫ్ట్‌గా కూడా అందజేస్తారు. క్రిప్టో వాలెట్‌గా బిజినెస్ ప్రారంభించిన యూనికాయిన్.. ఇప్పుడు క్రిప్టో ఎక్స్చేంజ్గా కూడా సేవలందిస్తున్నది.
Paytm’s IPO | పేటీఎంకు షాక్.. ఐపీవోకు అనుమతి లభిస్తుందా.. ఎందుకంటే?!!
Electric vehicles | పెట్రో ధరల పెంపు ఎఫెక్ట్.. మార్కెట్లోకి దూసుకొస్తున్న స్టార్టప్ కంపెనీలు
Vinesh Phogat: రెజ్లింగ్‌కు తిరిగొస్తానో లేదో.. తీవ్ర నిరాశలో వినేష్ ఫోగాట్