శనివారం 30 మే 2020
Business - May 14, 2020 , 01:03:51

జీఎస్టీ తగ్గింపునకు ఇది తరుణం కాదు

జీఎస్టీ తగ్గింపునకు ఇది తరుణం కాదు

మారుతీ చైర్మన్‌ భార్గవ

న్యూఢిల్లీ, మే 13: కరోనా సంక్షోభంతో ప్రస్తుతం దేశ ఆటోమొబైల్‌ పరిశ్రమలో ఉత్పత్తి అత్యంత కనిష్ఠస్థాయికి పడిపోయిందని, వాహనాలపై జీఎస్టీ తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరేందుకు ఇది సరైన తరుణం కాదని మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్‌ భార్గవ అభిప్రాయపడ్డారు. దేశీయ ప్యాసింజర్‌ వాహన మార్కెట్లో దాదాపు 54 శాతం వాటాతో ఎంఎస్‌ఐ అతిపెద్ద సంస్థగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. దేశంలో వాహనాల ఉత్పత్తి పెరిగిన తర్వాత జీఎస్టీ రేటు తగ్గిస్తే ఆటోమొబైల్‌ పరిశ్రమకు ప్రయోజనం చేకూరుతుందని భార్గవ పేర్కొన్నారు.


logo