సోమవారం 10 ఆగస్టు 2020
Business - Jul 25, 2020 , 00:17:45

చైనా కాదు చెన్నైలోనే

చైనా కాదు చెన్నైలోనే

  • ఐఫోన్‌ 11 తయారుచేస్తున్న యాపిల్‌ 

న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ యాపిల్‌.. మేక్‌ ఇన్‌ ఇండియాకు ఊతమిచ్చేలా కీలక చర్యకు ఉపక్రమించింది. తమ ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ ఐఫోన్‌ 11ను భారత్‌లోనే తయారు చేస్తున్నట్లు  ప్రకటించింది. చెన్నైలో ఉన్న ఫాక్స్‌కాన్‌ ప్లాంట్‌ ఇందుకు వేదికైంది. ఇప్పటివరకు ఈ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో తయారు చేసిన సంస్థ.. దీనిని భారత్‌లో ఉత్పత్తి చేయడం ఇదే తొలిసారి. ఈ విషయాన్ని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. మేక్‌ ఇన్‌ ఇండియాకు ఊతమిచ్చేలా యాపిల్‌ తన కీలక మోడల్‌ ఐఫోన్‌ 11ని భారత్‌లో ఉత్పత్తిని ప్రారంభించిందన్నారు. దీంతో ఈ ఫోన్‌ ధర భారీగా తగ్గే అవకాశం ఉన్నది. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఫోన్లపై 20 శాతం దిగుమతి సుంకం విధించడమే ఇందుకు కారణం. ఇప్పటివరకు యాపిల్‌ తన ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌ మోడల్‌ను మాత్రమే భారత్‌లో అసెంబ్లింగ్‌ చేస్తున్నది.


logo