బుధవారం 03 జూన్ 2020
Business - May 03, 2020 , 15:23:43

బీఓబీ, ఇండియ‌న్ బ్యాంకులో పెరిగిన నిర‌ర్ధ‌క ఆస్తులు

బీఓబీ, ఇండియ‌న్ బ్యాంకులో పెరిగిన నిర‌ర్ధ‌క ఆస్తులు

న్యూఢిల్లీ: బ‌్యాంక్ ఆఫ్ బ‌రోడా (బీఓబీ), ఇండియ‌న్ బ్యాంకులో గత ఆరేండ్లుగా నిర‌ర్థ‌క ఆస్తులు (నాన్ ప‌ర్‌ఫార్మింగ్ అసెట్స్‌-ఎన్‌పీఏలు) పెరిగిపోయాయ‌ని స‌మాచార హ‌క్కు చ‌ట్టం ద్వారా వెల్ల‌డైంది. బీఓబీ నిరర్థక ఆస్తులు ఆరు రెట్లు, ఇండియన్‌ బ్యాంక్‌ నిరర్థక ఆస్తులు నాలుగు రెట్లు పెరిగాయి. 2014 మార్చి 31 నాటికి రూ.11,876 కోట్లుగా ఉన్న‌ బీఓబీ నిర‌ర్ధ‌క ఆస్తులు.. 2019 డిసెంబర్ 31 నాటికి రూ.73,140 కోట్లకు చేరాయి. ఇక నిర‌ర్థ‌క ఆస్తుల ఖాతాల సంఖ్య‌ 2,08,035 నుంచి 6,17,306కు పెరిగింది.

ఇక, ఇండియన్‌ బ్యాంక్ నిర‌ర్థ‌క ఆస్తులు 2014 మార్చి 31 నాటికి రూ.8,068.05 కోట్లుగా ఉన్నాయి. 2020 డిసెంబరు 31 నాటికి ఆ ఆస్తుల విలువ‌ రూ.32,561కు చేరాయి. ఇండియ‌న్ బ్యాంకులో 2014 మార్చి 31 నాటికి 2,48,921గా ఉన్న‌ నిర‌ర్థ‌క‌ ఆస్తుల ఖాతాల సంఖ్య 2020, మార్చి 31 నాటికి 5,64,816కు పెరిగింది. రాజస్థాన్‌లోని కోటాకు చెందిన సుజీత్‌ స్వామి అనే కార్యకర్త స‌మాచార హ‌క్కు చ‌ట్టం కింద ద‌ర‌ఖాస్తు చేయ‌గా ఈ వివ‌రాలు వెల్ల‌డయ్యాయి. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo