గురువారం 02 ఏప్రిల్ 2020
Business - Feb 17, 2020 , 00:28:00

నాన్‌-ఆడిట్‌ సేవలు బంద్‌

నాన్‌-ఆడిట్‌ సేవలు బంద్‌
  • ప్రజా ప్రయోజన సంస్థలకు సంబంధించి డెలాయిట్‌ నిర్ణయం

న్యూఢిల్లీ: దేశంలో ప్రజా ప్రయోజన సంస్థలకు నాన్‌-ఆడిట్‌ సేవలను నిలిపివేస్తున్నట్లు ఆడిటింగ్‌ దిగ్గజం డెలాయిట్‌ హాస్కిన్స్‌ అండ్‌ సెల్స్‌ ప్రకటించింది. ఇప్పటికే ప్రైస్‌ వాటర్‌హౌజ్‌ నెట్‌వర్క్‌ సంస్థలు ఈ తరహా నిర్ణయాన్ని తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడు డెలాయిట్‌ కూడా అదే బాటలో పయనించడం గమనార్హం. తాము, తమ నెట్‌వర్క్‌ సంస్థలు పబ్లిక్‌ ఇంట్రెస్ట్‌ ఎంటిటీస్‌కు నాన్‌-ఆడిట్‌ సర్వీసెస్‌ను ఇండియాలో అందించబోమని ఆదివారం ఓ ప్రకటనలో డెలాయిట్‌ తెలియజేసింది. ప్రస్తుత దేశీయ నియమ, నిబంధనలకు అనుగుణంగా ఈ స్వచ్చంధ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.


logo
>>>>>>