గురువారం 06 ఆగస్టు 2020
Business - Jul 31, 2020 , 19:26:33

ఆగ‌స్టు త‌ర్వాత మార‌టోరియం అక్క‌ర్లేదు: ఎస్బీఐ చైర్మ‌న్‌

ఆగ‌స్టు త‌ర్వాత మార‌టోరియం అక్క‌ర్లేదు: ఎస్బీఐ చైర్మ‌న్‌

ముంబై: ఆగస్టు తర్వాత కాలపరిమితి రుణ వాయిదాలపై మారటోరియాన్ని పొడగించాల్సిన అవసరం లేదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్‌ రజనీశ్‌ కుమార్ తెలిపారు. ఆరు నెలల మారటోరియం సరిపోతుందన్నారు. మార‌టోరియాన్ని మరింత కాలం పొడగిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని ఆయ‌న‌ చెప్పారు. త‌న‌తోపాటు చాలామంది బ్యాంకర్లు ఆగస్టు 31 తర్వాత మారటోరియం పొడగించాల్సిన అవసరం లేదని భావిస్తున్నార‌ని, ఈఎంఐల‌పై మారటోరియానికి ఆరు నెలల కాలం చాలా ఎక్కువని రజనీశ్ పేర్కొన్నారు. 

మారటోరియాన్ని మరింత పొడగించ వ‌ద్దని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ను కోరిన హెచ్‌డీఎఫ్‌సీ ఛైర్మన్‌ దీపక్‌ పారేఖ్‌తో ర‌జ‌నీశ్‌ ఏకీభవించారు. ఈ త్రైమాసిక ఫలితాల్లో ఎస్‌బీఐ అదరగొట్టింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.4,189.34 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. వార్షికంగా చూస్తే ఇది 81% పెరుగుదల కావడం గమనార్హం. ఎస్‌బీఐ ఏకీకృత ఆదాయం గతేడాది ఇదే సమయంలో రూ.70,653.23 కోట్లతో పోలిస్తే ఈ సారి రూ.74,457.86కు పెరిగింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo