గురువారం 06 ఆగస్టు 2020
Business - Jul 08, 2020 , 02:11:06

కార్వీపై చర్యలు వద్దు: హైకోర్టు

 కార్వీపై చర్యలు వద్దు: హైకోర్టు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: నిధుల మళ్లింపు అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌పై తుది తీర్పు వచ్చేవరకు ఎలాంటి చర్యలు చేపట్టరాదని కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ, సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌ (ఎస్‌ఎఫ్‌ఐవో)కు హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీచేసింది. తమ సంస్థలో నిధుల మళ్లింపు అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేంద్రం తమ వాదన పట్టించుకోకుండా ఎస్‌ఎఫ్‌ఐవో దర్యాప్తునకు ఆదేశించిందని, ఈ మేరకు తమకు నోటీసులు జారీచేశారని తమపై చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని కార్వీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో కేంద్రం తరఫున అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌  రాజేశ్వర్‌రావు వాదనలు వినిపిస్తూ సెబీ, ఎస్‌ఎఫ్‌ఐవో దర్యాప్తు ప్రకారం కార్వీ సంస్థలో అవకతవకలు నిజమేనని తేలిందని పేర్కొన్నారు.


logo