బుధవారం 08 ఏప్రిల్ 2020
Business - Mar 02, 2020 , 23:42:29

ఐఐటీ హైదరాబాద్‌తో ఎన్‌ఎండీసీ ఒప్పందం

ఐఐటీ హైదరాబాద్‌తో ఎన్‌ఎండీసీ ఒప్పందం

హైదరాబాద్‌,నమస్తే తెలంగాణ: ఎన్‌ఎండీసీ స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి ముందుకొచ్చింది. వచ్చే ఐదేండ్లలో కనీసంగా 15 స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి రూ.10 కోట్లతో ప్రత్యేక ఫండ్‌ను ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా సోమవారం ఎన్‌ఎండీసీ కార్యాలయంలో ఐ- టీఐసీ, ఐఐటీ హైదరాబాద్‌, ఎన్‌ఎండీసీల స్టార్టప్‌ ఎకో సిస్టంను అభివృద్ధి చేసే ఒప్పందంపై ఎన్‌ఎండీసీ సీఎండీ బైజేంద్రకుమార్‌ సమక్షంలో సంతకం చేశారు. ఈ ఒప్పందంపై ఎన్‌ఎండీసీ నుంచి డైరక్టర్‌ పీకే శత్పథి, ఐఐటీ డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తిలు సంతకం చేశారు. దీని ద్వారా ఐదు సంవత్సరాల్లో 15 స్టార్టప్‌లకు 10 కోట్ల రూపాయలను ప్రోత్సాహకం అందించనున్నట్లు ఎన్‌ఎండీసీ సీఎండీ తెలిపారు.


logo