మాగ్నైట్ అదుర్స్: నెలలోనే 32 వేలు దాటిన బుకింగ్స్

న్యూఢిల్లీ: నిస్సాన్ ఇండియా నూతన రికార్డులను నెలకొల్పింది. ఆ సంస్థ సబ్ కంపాక్ట్ ఎస్యూవీ మోడల్ కారు మాగ్నైట్ బుకింగ్స్‌లో రికార్డులను తిరగరాసింది. ఈ మోడల్ కారు కోసం ఇప్పటికే 32,800 బుకింగ్స్ నమోదయ్యాయని నిస్సాన్ ఇండియా సోమవారం తెలిపింది. నెల రోజుల క్రితం విపణిలోకి అడుగు పెట్టింది మాగ్నైట్ సబ్ కంపాక్ట్. భారతదేశంలో తయారైన తొలి సబ్ కంపాక్ట్ ఎస్యూవీ మోడల్ కారు ఇదే. మేడ్ ఇన్ ఇండియా మోడల్ అయిన ఈ కారుకు ఏషియాన్ ఎన్కాప్ సంస్థ నుంచి 4 స్టార్ రేటింగ్ లభించింది. దీంతో మాగ్నైట్ మోడల్ కార్ల విక్రయాలు పుంజుకుంటాయని నిస్సాన్ ఇండియా వెల్లడించింది.
నిస్సాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాకేశ్ శ్రీవాత్సవ మాట్లాడుతూ.. ‘మాగ్నైట్ మోడల్ కారుకు అధిక రెస్పాన్స్ వస్తున్నది. తొలి ఐదు రోజుల్లో 5000 బుకింగ్స్ నమోదు చేసుకుంటే, 15 రోజుల్లో 15వేల యూనిట్లు బుక్ అయ్యాయి. ఇప్పుడు 32,800 కస్టమర్ బుకింగ్స్ రికార్డయ్యాయి. 1.80 లక్షల ఎంక్వైరీలు నమోదు అయ్యాయి’ అని చెప్పారు.
ఆన్లైన్లో 3800 యూనిట్ల బుకింగ్స్ నమోదయ్యాయని రాకేశ్ శ్రీవాత్సవ వెల్లడించారు. సీఎంఎఫ్-ఏ ప్లస్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా న్యూ మాగ్నైట్ రూపుదిద్దుకున్నది. నిస్సాన్ న్యూ మాగ్నైట్ మోడల్ కారు ఎక్స్ఈ, ఎక్స్ఎల్, ఎక్స్‌వీ, ఎక్స్‌వీ ప్రీమియం వర్షన్లలో ఈ కారు లభిస్తుంది. ఇంజిన్ అండ్ ట్రాన్సిమిషన్ చాయిస్‌లతో 20 విభిన్న గ్రేడ్లలో ఈ కారు అందుబాటులో ఉంది.
నిస్సాన్ మాగ్నైట్ మోడల్ కారు ఎనిమిది అంగుళాల ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ డిస్ప్లే, వైర్లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఏడు అంగుళాల టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ ఏసీ, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ ఓఆర్వీఎంస్, పుష్ బటన్ స్టార్ట్, క్రూయిజ్ కంట్రోల్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టం తదితర ఫీచర్లు ఉన్నాయి. ఎక్స్‌వీ లేదా ఎక్స్‌వీ ప్రీమియం మోడల్ కార్లు కొనుగోలు చేసే కస్టమర్లు.. వైర్ లెస్ చార్జర్, ఎయిర్ ఫ్యూరిఫయర్, ఆంబియంట్ మూడ్ లైటింగ్, పడిల్ ల్యాంప్స్, జేబీఎల్ నుంచి హై ఎండ్ స్పీకర్ల వంటి ఫీచర్లతో కూడిన ‘టెక్ ప్యాక్’ కూడా తీసుకోవచ్చు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ
తాజావార్తలు
- ఏనుగు దాడిలో ఇద్దరు దుర్మరణం
- కోవిడ్ టీకా తీసుకున్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్
- హీరోను అన్నా అనేసి నాలుక కరుచుకున్న లావణ్య
- వింగ్ కమాండర్ అభినందన్ విడుదల.. చరిత్రలో ఈరోజు
- చెప్పుతో కొట్టిందనే కోపంతో మహిళకు కత్తిపోట్లు!
- బీజేపీ ఎమ్మెల్సీకి దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చిన కేటీఆర్
- బెంగాల్ సీఎం మమతతో భేటీ కానున్న తేజస్వి
- కామాఖ్య ఆలయాన్ని దర్శించిన ప్రియాంకా గాంధీ
- ఒక్క సంఘటనతో పరువు మొత్తం పోగొట్టుకున్న యూట్యూబ్ స్టార్
- ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం