సోమవారం 01 మార్చి 2021
Business - Feb 01, 2021 , 14:39:34

మగువలకు ఊరట : గోల్డ్‌, సిల్వర్‌పై దిగుమతి సుంకం తగ్గింపు

మగువలకు ఊరట : గోల్డ్‌, సిల్వర్‌పై దిగుమతి సుంకం తగ్గింపు

న్యూఢిల్లీ : బంగారం, వెండిపై కస్టమ్స్‌ సుంకాల క్రమబద్ధీకరణలో భాగంగా ఈ రెండు మెటల్స్‌పై ప్రస్తుతం 12.5 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని 7.5 శాతానికి తగ్గించనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. దీంతో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి.

ఇక బడ్జెట్‌ ప్రసంగంలో సోలార్‌ పరికరాలు, నిర్ధిష్ట ఆటో విడిభాగాలు, కాటన్‌, ముడి సిల్క్‌పై కస్టమ్స్‌ సుంకాలను పెంచుతామని పేర్కొన్నారు. 400 ఏళ్ల నాటి కస్టమ్స్‌ వ్యవస్ధను ఈ ఏడాది క్రమబద్ధీకరిస్తామని, పలు వస్తువులపై సుంకాల్లో హేతుబద్ధత తీసుకువస్తామని తెలిపారు. 

VIDEOS

logo