బుధవారం 21 అక్టోబర్ 2020
Business - May 29, 2020 , 01:30:15

ఆధార్‌ ఉంటే క్షణాల్లో ఈ-పాన్‌

ఆధార్‌ ఉంటే క్షణాల్లో ఈ-పాన్‌

న్యూఢిల్లీ, మే 28: ఆధార్‌ వివరాలతో తక్షణమే ఈ-పాన్‌ను కేటాయించే విధానాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం ప్రారంభించారు. పన్ను చెల్లింపుల ప్రక్రియను మరింత సులభతరం చేయాలన్న ఉద్దేశంతో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ సేవ పూర్తి ఉచితంగా లభిస్తుందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది. పాన్‌ కేటాయింపు ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు నిర్మలా సీతారామన్‌ ఈ ఏడాది బడ్జెట్‌లోనే ఓ ప్రతిపాదన చేశారు. అందులో భాగంగానే ప్రతిసారి అన్ని వివరాలతో దరఖాస్తును నింపాల్సిన అవసరం లేకుండా కేవలం ఆధార్‌ వివరాలతో ఆన్‌లైన్‌లో అప్పటికప్పుడు పాన్‌ నంబర్‌ను కేటాయించే విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. చెల్లుబాటయ్యే ఆధార్‌ నంబర్‌ను, ఆధార్‌తో అనుసంధానమైన ఫోన్‌ నంబర్‌ను కలిగివున్న దరఖాస్తుదారులకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని, ఎలక్ట్రానిక్‌ పాన్‌ (ఈ-పాన్‌) ఉచితంగా లభిస్తుందని సీబీడీటీ వివరించింది.

ఆర్థిక పరిస్థితిపై నిర్మలమ్మ సమీక్ష

మరోవైపు దేశ ఆర్థిక పరిస్థితిపై నిర్మలా సీతారామన్‌ గురువారం ఎఫ్‌ఎస్‌డీసీ (ఫైనాన్షియల్‌ స్టెబిలిటీ అండ్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌) సమావేశంలో సమీక్ష నిర్వహించారు. కొవిడ్‌-19 సంక్షోభం తలెత్తిన తర్వాత ఎఫ్‌ఎస్‌డీసీ భేటీ కావడం ఇదే తొలిసారి.



logo