బుధవారం 05 ఆగస్టు 2020
Business - Jul 09, 2020 , 02:41:37

రూ.329 కోట్ల నీరవ్‌ ఆస్తులు జప్తు

రూ.329 కోట్ల నీరవ్‌ ఆస్తులు జప్తు

న్యూఢిల్లీ, జూలై 8: నీరవ్‌ మోదీకి చెందిన రూ. 329.66 కోట్ల ఆస్తులను జప్తు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) బుధవారం తెలియజేసింది. పరారీ ఆర్థిక నేరగాళ్ల (ఎఫ్‌ఈవో) చట్టం కింద ఈ ఆస్తులను ఈడీ స్వాధీనపర్చుకున్నది. దేశంలో ఈ చట్టం ద్వారా జరిగిన తొలి ఆస్తుల జప్తు ఇదే. ఈ చట్టం ప్రకారం 90 రోజుల తర్వాత జప్తు చేసిన ఆస్తులను వేలం వేయవచ్చు. ఆ సొమ్ము ప్రభుత్వ ఖజానాలోకి వెళ్తుంది. రూ.14 వేల కోట్ల పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) మోసంలో వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ, రత్నాల వ్యాపారి మెహుల్‌ చోక్సీలు ప్రధాన నిందితులుగా ఉన్నారు. కాగా, ముంబైలోని వొర్లీలోగల ప్రఖ్యాత సముద్ర మహల్‌ భవంతిలో నాలుగు ఫ్లాట్లు, అలీబాగ్‌లో సముద్ర ముఖాన ఉన్న ఫామ్‌ హౌజ్‌, భూమి, జైసల్మేర్‌లో విండ్‌ మిల్‌, లండన్‌లోని ఫ్లాట్‌, దుబాయ్‌లోని రెసిడెన్షియల్‌ ఫ్లాట్లు, షేర్లు, బ్యాంక్‌ డిపాజిట్లు ఈడీ జప్తు చేసిన ఆస్తుల్లో ఉన్నాయి. 


logo