సోమవారం 01 మార్చి 2021
Business - Feb 20, 2021 , 00:43:42

15000 దిగువకు నిఫ్టీ

15000  దిగువకు నిఫ్టీ

51 వేల కిందకుదిగొచ్చిన సెన్సెక్స్‌

ముంబై, ఫిబ్రవరి 19: రాకెట్‌ వేగంతో దూసుకుపోయిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు అంతే వేగంతో దిగొస్తున్నాయి. వరుసగా నాలుగోరోజు అమ్మకాల ఒత్తిడి కారణంగా సూచీలు భారీగా నష్టపోయాయి. 30 షేర్ల ఇండెక్స్‌ సూచీ సెన్సెక్స్‌ 51 వేల దిగువకు దిగిరాగా, జాతీయ స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ నిఫ్టీ 15 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అలజడి కారణంగా వరుసగా దేశీయ సూచీలు జారుకుంటున్నాయి. వారాంతం ట్రేడింగ్‌ ముగిసే సరికి సెన్సెక్స్‌ మరో 434.93 పాయింట్లు పతనం చెంది 50,889.76కి పరిమితమవగా, నిఫ్టీ 137.20 పాయింట్లు తగ్గి 14,981.75 వద్ద ముగిసింది. బ్యాంకింగ్‌, వాహన రంగ షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాల కారణంగా సూచీలు దిగువ ముఖం పట్టాయని తెలిపింది. మొత్తంమీద ఈ వారంలో సెన్సెక్స్‌ 654.54 పాయింట్లు(1.26 శాతం), నిఫ్టీ 181.55 పాయింట్లు(1.19 శాతం) నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే ఆటో, మెటల్‌, బ్యాంకింగ్‌, హెల్త్‌కేర్‌, ఫైనాన్స్‌ రంగానికి చెందిన సూచీలు 2.59% వరకు నష్టపోగా..ఎనర్జీ రంగానికి చెందిన షేర్లు మాత్రం లాభపడ్డాయి. 

నష్టపోయిన షేర్లు

ఓఎన్‌జీసీ అత్యధికంగా 5 శాతం నష్టపోయింది. దీంతోపాటు ఎస్బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఆటో, మారుతి, మహీంద్రాల షేర్లు నాలుగు శాతం వరకు కోల్పోయాయి. 

పెరిగిన షేర్లు

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, ఎన్‌టీపీసీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌లు రెండు శాతం వరకు బలపడ్డాయి.

VIDEOS

logo