శనివారం 28 మార్చి 2020
Business - Jan 29, 2020 , 23:29:31

12 వేల పైకి నిఫ్టీ

12 వేల పైకి నిఫ్టీ
  • 232 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్‌

ముంబై, జనవరి 29: స్టాక్‌ మార్కెట్లు తిరిగి కోలుకున్నాయి. బ్లూచిప్‌ సంస్థలు ఇచ్చిన దన్నుతో లాభాల్లో ప్రారంభమైన సూచీలు కడవరకు ఇదే ట్రెండ్‌ కొనసాగాయి. మార్కెట్‌ ముగిసే సమయానికి 30 షేర్ల ఇండెక్స్‌ సూచీ సెన్సెక్స్‌ 231.80 పాయింట్లు పెరిగి 41,198.66 పాయింట్లకు చేరుకోగా, నిఫ్టీ 73.70 పాయింట్లు అధికమై 12,129.50కి చేరుకున్నది. అంచనాలకుమించి ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో బజాజ్‌ ఫైనాన్స్‌ 4.95 శాతం పెరిగి టాప్‌ గెయినర్‌గా నిలిచింది. వీటితోపాటు నెస్లె ఇండియా, ఐటీసీ, ఇన్ఫోసిస్‌, ఎన్‌టీపీసీలకు మదుపరుల నుంచి మద్దతు లభించగా.. టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, యాక్సిస్‌ బ్యాంకులు నష్టపోయాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్‌లో వృద్ధికి ఊతమిచ్చే చర్యలు తీసుకోనున్నట్లు వచ్చిన సంకేతాలు మార్కెట్లకు జోష్‌ నిచ్చాయని విశ్లేషకులు వెల్లడించారు.  బ్రెంట్‌ క్రూడాయిల్‌ స్వల్పంగా పెరిగి 59.93 డాలర్లకు చేరుకున్నది. 


logo