e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home News న్యూ లేబ‌ర్ కోడ్‌తో త‌గ్గ‌నున్న వేత‌నం.. ఎందుకంటే?!

న్యూ లేబ‌ర్ కోడ్‌తో త‌గ్గ‌నున్న వేత‌నం.. ఎందుకంటే?!

న్యూ లేబ‌ర్ కోడ్‌తో త‌గ్గ‌నున్న వేత‌నం.. ఎందుకంటే?!

న్యూఢిల్లీ: పాత కార్మిక చ‌ట్టాల స్థానే కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబ‌ర్ కోడ్‌ల ఫ‌లితంగా వివిధ సంస్థ‌ల్లో ప‌ని చేస్తున్న ఉద్యోగులు, కార్మికులు త‌గ్గిన వేత‌నాన్ని ఇంటికి తీసుకెళ్లాల్సిన ప‌రిస్థితులు ఉన్నాయి. ప్రావిడెండ్ ఫండ్ (పీఎఫ్‌)లో వాటా భాగ‌స్వామ్యం యాజ‌మాన్యాల‌పై భారం ప‌డ‌నున్న‌ద‌ని పీటీఐ వార్తా సంస్థ ఓ వార్తా క‌థ‌నం ప్ర‌చురించింది. అన్ని స‌క్ర‌మంగా జ‌రిగితే ఈ లేబర్‌కోడ్‌లు కొన్ని నెల‌ల్లో అమ‌ల్లోకి రానున్నాయి.

ఈ ఏడాది ఏప్రిల్ ఒక‌టో తేదీ నుంచే లేబ‌ర్ కోడ్‌ల‌ను అమ‌లు చేసేందుకు కేంద్ర కార్మిక‌శాఖ సిద్ధ‌మైంది. కానీ కొన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఇప్ప‌టికి నూత‌న నిబంధ‌న‌ల‌ను నోటిఫై చేయ‌క‌పోవ‌డంతో ఆల‌స్యం అవుతున్న‌ది.

భార‌త రాజ్యాంగం ప్ర‌కారం కార్మికుల అంశం ఉమ్మ‌డి హ‌క్కుల్లోకి వ‌స్తుంది. అంటే లేబ‌ర్ కోడ్‌ల‌ను కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు విడివిడిగా నోటిఫై చేస్తేనే కేంద్ర ప్ర‌భుత్వం దీన్ని అమ‌లు చేయ‌గ‌లుగుతుంది.

లేబ‌ర్ కోడ్‌ల అమ‌లులో జాప్యంతో త‌మ సిబ్బంది లేదా ఉద్యోగులు లేదా కార్మికుల వేత‌నాల ప్ర‌క్రియ‌ను తిర‌గ రాసేందుకు వివిధ సంస్థ‌ల యాజ‌మాన్యాల‌కు మ‌రింత టైం ల‌భించిన‌ట్లే. లేబ‌ర్ కోడ్‌ల‌లోని కొన్ని నిబంధ‌న‌లు సిబ్బంది యాజ‌మాన్యాల‌పై భారం మోపుతాయ‌న్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఇప్ప‌టికైతే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, బీహార్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, హ‌ర్యానా, ఒడిశా, పంజాబ్‌, గుజ‌రాత్‌, క‌ర్ణాట‌క‌, ఉత్త‌రాఖండ్ రాష్ట్ర ప్ర‌భుత్వాలు నిబంధ‌న‌ల ముసాయిదాల‌ను స‌ర్క్యులేట్ చేశాయి. మ‌రికొన్ని రాష్ట్రాలు ఈ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేసే ప‌నిలో ప‌డ్డాయి.

నూత‌న లేబ‌ర్ కోడ్‌లు కొన్ని నెల‌ల్లో అమ‌లులోకి రానున్నాయి. ఆ త‌ర్వాత వీటి అమ‌లుపై యాజ‌మాన్యాలు ఫిర్యాదు చేయ‌డానికి కొంత టైం కేంద్రం ఇవ్వ‌నున్న‌ది.

నూత‌న లేబ‌ర్ కోడ్‌ల అమ‌లుతో వేత‌నాల చెల్లింపులో గ‌ణ‌నీయ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఉద్యోగుల క‌నీస వేత‌నం, ప్రావిడెండ్ ఫండ్ గ‌ణ‌న‌లో మార్పులు జ‌రుగుతాయి.

న్యూ లేబ‌ర్ కోడ్‌తో త‌గ్గ‌నున్న వేత‌నం.. ఎందుకంటే?!

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మెరుగుద‌ల‌కు, భారాన్ని త‌గ్గించుకోవ‌డానికి 29 లేబ‌ర్ కోడ్‌ల‌ను నాలుగు కోడ్‌ల్లోకి కుదించి వేశారు. ఉద్యోగుల నియామ‌కంలో గానీ, తొల‌గింపులో గానీ యాజ‌మాన్యాల‌కు వెసులుబాటు ల‌భిస్తుంది. 44 పాత కేంద్ర కార్మిక చ‌ట్టాల స్థానే ఈ లేబ‌ర్ కోడ్‌లు అమ‌లులోకి తెచ్చారు.

న్యూ వేజ్ కోడ్ ప్ర‌కారం అల‌వెన్స్‌ల‌పై 50 శాతం వ‌ర‌కు ప‌రిమితులు ఉంటాయి. 50 శాతం స్థూల వేత‌నం ఉద్యోగి క‌నీస వేత‌నంగా ఉంటుంది. ఉద్యోగి క‌నీస వేత‌నంలో పీఎఫ్ 10-12 శాతం ఉంటుంది.

దీనికి అనుగుణంగా ఉద్యోగి వేత‌నం త‌గ్గిపోతుంది.. వారి వాటా పీఎఫ్ పెరుగుతుంది. త‌ద‌నుగుణంగా పీఎఫ్‌లో యాజ‌మాన్యాలు జ‌మ చేసే వాటా పెరుగుతుంద‌న్న అభిప్రాయం ఉంది.

ఈ ప‌రిస్థితుల్లో ఉద్యోగుల వేత‌నాల‌ను వివిధ అల‌వెన్సుల కింద విడ‌గొట్టే అవ‌కాశం ఉంది. త‌ద్వారా పీఎఫ్ వాటా భారం, ఆదాయం ప‌న్ను చెల్లింపు భారం త‌గ్గించుకోవ‌చ్చు. ఒక‌సారి లేబ‌ర్‌కోడ్‌లు అమ‌లులోకి వ‌స్తే, సిబ్బంది వేత‌నాల‌ను యాజ‌మాన్యాలు పున‌ర్వ్య‌వ‌స్థీక‌రించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చ‌ద‌వండి:

చ‌రిత్ర‌లో ఈరోజు.. తొలి వ‌న్డే వర‌ల్డ్ క‌ప్ ప్రారంభం

సెంట్ర‌ల్ బ్యాంక్, ఐఓబీలో వాటా విక్ర‌యానికి కేంద్రం స‌న్నాహ‌లు

అన్‌లాక్ షురూ : మెట్రో రైల్, మార్కెట్లు ఓపెన్

కొవిడ్ చికిత్స నుంచి ఐవ‌ర్‌మెక్టిన్‌, డాక్సీసైక్లిన్ ఔట్.. సీటీ స్కాన్లూ వ‌ద్దు!

దేశంలో ప్రమాదకరమైన కరోనా మరో వేరియంట్‌ గుర్తింపు

కొవాగ్జిన్ కంటే కొవిషీల్డ్‌తోనే ఎక్కువ యాంటీబాడీలు!

మళ్లీ అమ్మాయి పుట్టిందని భార్యా పిల్లలను బావిలోకి తోసేసిన భర్త

బాదుడే బాదుడు.. మరోసారి పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

ఢిల్లీ ఎయిమ్స్‌లో పిల్లలపై కొవాగ్జిన్‌ ట్రయల్స్‌

మహిళలో 32 మ్యుటేషన్లు!

అధిష్ఠానం కోరితే రాజీనామా చేస్తా

జూలై 1 నుంచి బ్యాడ్ బ్యాంక్ ప్రారంభం?! ఎందుకంటే?!

చోక్సీ అప్ప‌గింత డౌటేనా? అస‌లేం జ‌రిగింది?!

స్వ‌ల్ప‌కాలం కార్ల ధ‌ర‌లు స్టేబుల్: ఫోక్స్ వ్యాగ‌న్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
న్యూ లేబ‌ర్ కోడ్‌తో త‌గ్గ‌నున్న వేత‌నం.. ఎందుకంటే?!

ట్రెండింగ్‌

Advertisement