ఏప్రిల్ 1 నుంచి విలీన బ్యాంకుల చెక్కులు చెల్లవు

- యూనియన్ బ్యాంకు లోగోతో కొత్త పాస్‌పుస్తకాలు
వరంగల్, జనవరి 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీ)లో విలీనమైన బ్యాంకుల చెక్కులు మార్చి 31 వరకే చెల్లుబాటవుతాయి. ఆంధ్రా, కార్పొరేషన్ బ్యాంకు ఖాతాలను యూనియన్ బ్యాంకులోకి మార్చే ప్రక్రియ జనవరి నుంచి మొదలైంది. మార్చి 31 నాటికి ఈ ప్రక్రియ ముగుస్తుంది. కాగా, ఆంధ్రా బ్యాంకు ఖాతా నంబరు, కస్టమర్ ఐడీ పాతదే కొనసాగుతుందని బ్యాంక్ వర్గాలు తెలిపాయి. అయితే చెక్కు బుక్కులు మాత్రం మార్చి 31 వరకే చెల్లుబాటవుతాయి. ఏప్రిల్ 1 నుంచి యూనియన్ బ్యాంకు చెక్కులు మాత్రమే చెలామణి అవుతాయి. అలాగే ఆంధ్రా బ్యాంకు ఐఎఫ్ఎస్సీ కోడ్ కూడా మార్చి 31 వరకే పని చేస్తుంది. మొబైల్ బ్యాంకింగ్ వాడేవారు యూ-మొబైల్ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ ద్వారా ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించారు. ఖాతాదారులు ఈ విషయాలను గమనించి ఏమైనా సందేహాలు ఉంటే యూనియన్ బ్యాంకు కస్టమర్ కేర్ నంబర్ 18002082244ను సంప్రదించాలని ఆంధ్రా బ్యాంకు తెలిపింది.
యూబీ లాభం 727 కోట్లు
గడిచిన త్రైమాసికంలో రూ. 726.84 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. అంతక్రితం ఏడాది రూ.574.58 కోట్ల లాభాన్ని గడించింది. గతేడాది నమోదైన లాభాలతో పోల్చుకోవాల్సిన అవసరం లేదని, ఆంధ్రాబ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ విలీనం కావడం ఇందుకు కారణమని విశ్లేషించింది. సమీక్షకాలంలో బ్యాంక్ రూ.20,102. 84 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.
తాజావార్తలు
- టెస్ట్ అరంగేట్రానికి 50 ఏళ్లు.. గవాస్కర్‌ను సత్కరించిన బీసీసీఐ
- అతను తెలియక తప్పు చేశాడు: బీహార్ సీఎం
- బీజేపీలోకి నటుడు మిథున్ చక్రవర్తి?
- ఇన్‌కం టాక్స్ దాడులపై స్పందించిన హీరోయిన్ తాప్సీ
- బుమ్రా, అనుపమ పెళ్లిపై వచ్చిన క్లారిటీ..!
- అశ్విన్, అక్షర్.. వణికిస్తున్న భారత స్పిన్నర్లు
- బీజేపీలో చేరిన బెంగాల్ కీలక నేత దినేశ్ త్రివేది
- హాట్ ఫొటోలతో హీటెక్కిస్తున్న పూనమ్ బజ్వా
- కన్యాకుమారి లోక్‌సభ.. బీజేపీ అభ్యర్థి ఖరారు
- మహేష్ బాబు కొత్త కార్‌వ్యాన్ ఇదే..!