మంగళవారం 02 మార్చి 2021
Business - Jan 06, 2021 , 23:53:12

కొత్త ఫార్చ్యూనర్‌.. ప్రారంభ ధర రూ.29.98 లక్షలు

కొత్త ఫార్చ్యూనర్‌.. ప్రారంభ ధర రూ.29.98 లక్షలు

న్యూఢిల్లీ, జనవరి 6: టయోటా కిర్లోస్కర్‌ దేశీయ మార్కెట్లోకి ప్రీమియం ఎస్‌యూవీ ఫార్చ్యూనర్‌లో సరికొత్త వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఢిల్లీ షోరూంలో ఈ వాహనం రూ.29.98 లక్షల నుంచి రూ.37.43 లక్షల మధ్యలో లభించనున్నది. 2.8 లీటర్ల డీజిల్‌ ఇంజిన్‌ కలిగిన ఈ నూతన ఫార్చ్యూనర్‌లో 6-స్పీడ్‌ ఆటోమేటిక్‌, 6-స్పీడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌, 2.7 లీటర్ల పెట్రోల్‌ ఇంజిన్‌ కలిగిన కారులో 6-స్పీడ్‌ ఆటోమేటిక్‌, 5-స్పీడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ కలిగివున్నాయి. ఈ ఫార్చ్యూనర్‌లో 11 జేబీఎల్‌ ఆడియో స్పీకర్లు, సీట్‌ వెంటిలేషన్‌ సిస్టమ్‌, ఆండ్రాయిడ్‌ ఆటో/యాపిల్‌ కార్‌ప్లే కనెక్టివిటీ, రియల్‌-టైమ్‌ ట్రాకింగ్‌, లాస్ట్‌ పార్క్‌ లోకేషన్‌ వంటి ఫీచర్స్‌ ఉన్నాయి.  దీంతోపాటు రూ.37.58 లక్షల విలువైన లెజెండర్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. 2009లో దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ ఫార్చ్యూనర్‌ కారు ఇప్పటి వరకు 1.7 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. 


VIDEOS

logo