మంగళవారం 04 ఆగస్టు 2020
Business - Jul 08, 2020 , 02:11:04

హోండా నుంచి సరికొత్త బైకు

హోండా నుంచి సరికొత్త బైకు

  • ధర రూ.1.05 లక్షలు

న్యూఢిల్లీ, జూలై 7:  హోండా మోటర్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా..దేశీయ మార్కెట్లోకి సరికొత్త మోటార్‌సైకిల్‌ ‘ఎక్స్‌-బ్లేడ్‌'ను అందుబాటులోకి తీసుకొచ్చింది. బీఎస్‌-6 ప్రమాణాలకు అనుగుణంగా 160 సీసీ సామర్థ్యంతో తయా రు చేసిన ఈ బైకు ధరను రూ. 1,05,325గా నిర్ణయించింది. ఈ బైకులో నూతన ఫీచర్స్‌ ఉన్నాయని, యాంటి లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌, ఇంజిన్‌ను అవసరం ఉన్నప్పుడు ఆనాఫ్‌ చేసుకునే విధంగా తయారు చేసినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. logo