శుక్రవారం 14 ఆగస్టు 2020
Business - Jul 17, 2020 , 02:54:07

మార్కెట్లోకి కొత్తగా యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ మాస్క్

మార్కెట్లోకి కొత్తగా యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ మాస్క్

ప్రజలు కరోనాను ఎదుర్కునేందుకు టెక్నికల్ టెక్స్ టైల్ మార్కెట్లో అతిపెద్ద సంస్థ అయిన శివ టెక్స్ యార్న్ యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ మాస్క్​లను మార్కెట్లోకి తెచ్చింది. కేవలం రూ.49 లకే లభించే ఈ మెడిక్ విరోస్టాస్ మాస్కును తిరిగి వాడుకునేలా రూపొందించారు.

వైరస్​లను 99శాతం వరకు అడ్డుకునేలా ఈ మాస్కులను రూపొందించినట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. మెడిక్ విరోస్టాస్ మాస్కులను మూడు సార్లు ఉతికి తిరిగి ఉపయోగించుకోవచ్చు. ఉతికినప్పటికీ ఈ మాస్కులు కల్పించే రక్షణలో ఎలాంటి మార్పు ఉండదు. మాస్కు తయారీలో ఎలాంటి టాక్సిక్ కెమికల్​లను​ ఉపయోగించలేదు. ఈ విషయాన్ని పలు దేశ విదేశీలు ల్యాబ్లు నిర్థారించినట్లు సంస్థ వెల్లడించింది

సామాన్యులకు తక్కువ ధరకే ఎక్కువ రక్షణ కల్పించడమే తమ లక్ష్యమని శివ టెక్స్ యార్న్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కేఎస్ సుందరరామన్ అన్నారు. తమ మాస్కులు కరోనాతో పాటు గాలి ద్వారా వ్యాపించే వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయని చెప్పారు. ఈ మేడిన్ ఇండియా ఉత్పత్తి ప్రపంచంలోనే అత్యుత్తమైనదని సుందరరామన్ చెప్పారు.

మెడిక్ విరోస్టాస్ మాస్క్​లను దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాలకు సైతం సరఫరా చేయాలని కంపెనీ భావిస్తోందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. కంపెనీ 20 లక్షల విరోస్టాట్ మాస్కులతో పాటు మెడిక్ బ్రాండ్ పేరుతో ఇతర మాస్కులు, పీపీఈ కిట్లను తయారు చేస్తోంది.


logo