సీఈవో పదవికి గుడ్‌బై

- ఈ ఏడాదిలోనే వైదొలగాలని నిర్ణయం
- కార్యనిర్వాహక చైర్మన్‌గా కొనసాగుతానన్న బెజోస్
- అమెజాన్ కొత్త సీఈవోగా వెబ్ సర్వీసెస్ అధిపతి జెస్సీ
న్యూయార్క్, ఫిబ్రవరి 3: అంతర్జాతీయ ఈ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్' వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (57) సంచలన నిర్ణయం తీసుకున్నారు. దాదా పు మూడు దశాబ్దాల క్రితం అమెజాన్‌ను స్థాపించిన ఆయన ఈ ఏడాది సీఈవో బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. అనంతరం అమెజాన్ కార్యనిర్వాహక చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి కొత్త వ్యాపారాలపై దృష్టి కేంద్రీకరించనున్నట్లు బెజోస్ స్పష్టం చేశా రు. ఆయన ఈ ఏడాది మూడో త్రైమాసికంలో కంపె నీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవి చేపడతారని, అదే సమయంలో అమెజాన్ క్లౌడ్ సర్వీసెస్ వ్యాపార విభాగమైన అమెజాన్ వెబ్ సర్వీసెస్ అధిపతి ఆండీ జెస్సీ (53) అమెజాన్ సీఈవోగా నియమితులవుతారని కంపెనీ వెల్లడించింది. 1997లో మార్కెటింగ్ మేనేజర్‌గా అమెజాన్‌లో చేరిన జెస్సీ.. 2003లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. 2019లో 280.5 బిలియన్ డాలర్లు (రూ.20,45, 572 కోట్లు)గా ఉన్న తమ నికర అమ్మకాలు 2020లో 38% వృద్ధితో 386.1 బిలియన్ డాలర్ల (రూ.28,15, 338 కోట్ల)కు పెరిగినట్లు అమెజాన్ ప్రకటించింది. 1995లో ఆన్లైన్ పుస్తక వ్యాపార సంస్థగా అమెజాన్‌ను స్థాపించిన బెజోస్.. ఆ తర్వాత దాన్ని రూ.1,23,96, 272 కోట్ల విలువైన దిగ్గజ సంస్థగా తీర్చిద్దారు. ఈ క్రమంలో బెజోస్ ప్రపంచంలోని అత్యంత సంప న్నుల్లో ఒకరుగా ఆవిర్భవించారు.
తాజావార్తలు
- అల్లరి నరేష్‌కు దిల్ రాజు బంపర్ ఆఫర్
- ప్రేమోన్మాది ఘాతుకం..
- అధునాతన 5జీ సేవలకు గూగుల్క్లౌడ్తో జత కలిసిన ఇంటెల్
- బైక్‌ను ఢీకొట్టిన బొలెరో.. ఇద్దరు దుర్మరణం
- చిలీకి నౌకను నిర్మించిన భారత సంస్థ ఎల్ అండ్ టీ
- అనసూయను ఆశ్చర్యంలో ముంచేసిన అభిమాని
- రోహిత్ శర్మ అర్ధసెంచరీ
- తొలిరోజు పాఠశాలలకు 10 శాతంలోపే విద్యార్థులు
- టీఆర్ఎస్తోనే నిరంతర అభివృద్ధి : పల్లా రాజేశ్వర్ రెడ్డి
- గురువాయూర్‌లో ఏనుగులకు పరుగుపందెం