శుక్రవారం 22 జనవరి 2021
Business - Jan 14, 2021 , 02:50:36

టర్బోచార్జ్‌డ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో సరికొత్త ఆల్ట్రోజ్‌

టర్బోచార్జ్‌డ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో సరికొత్త ఆల్ట్రోజ్‌

న్యూఢిల్లీ, జనవరి 13: దేశీయ ఆటోమొబైల్‌ సంస్థ టాటా మోటర్స్‌ తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ కారు ఆల్ట్రోజ్‌ను సరికొత్త పెట్రోల్‌ వేరియంట్‌లో ఆవిష్కరించింది. వచ్చే వారం నుంచి దేశవ్యాప్తంగా ఈ కార్ల అమ్మకాలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తున్నది. 110 పీఎస్‌ శక్తిని ఉత్పత్తిచేసే 1.2 లీటర్‌ బై-టర్బోచార్జ్‌డ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ను అమర్చిన ఈ వేరియంట్‌ కేవలం 12 సెకన్ల వ్యవధిలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని టాటా మోటర్స్‌ బుధవారం ప్రకటించింది. కానీ దీని ధర ఎంతో వెల్లడించలేదు. 86 పీఎస్‌ శక్తినిచ్చే 1.2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌, 90 పీఎస్‌ శక్తినిచ్చే 1.5 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ కలిగిన ఆల్ట్రోజ్‌ కార్లను టాటా మోటర్స్‌ ఇప్పటికే అమ్ముతున్న విషయం తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఇప్పటివరకు 45 వేల ఆల్ట్రోజ్‌ కార్లను అమ్మినట్లు టాటా మోటర్స్‌ ప్యాసింజర్‌ వెహికల్‌ బిజినెస్‌ యూనిట్‌ (పీవీబీయూ) మార్కెటింగ్‌ హెడ్‌ వివేక్‌ శ్రీవాత్సవ తెలిపారు. 


logo