బుధవారం 08 ఏప్రిల్ 2020
Business - Feb 13, 2020 , 00:07:15

నాట్కో రూ.3.50 మధ్యంతర డివిడెండ్‌

నాట్కో రూ.3.50 మధ్యంతర డివిడెండ్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 12: హైదరాబాద్‌ కేంద్రస్థానంగా ఔషధాల తయారీ సంస్థ నాట్కో ఫార్మా నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్‌ 31తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.104.40 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని ఆర్జించింది. 2018-19 ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.159.30 కోట్లతో పోలిస్తే 34.46 శాతం క్షీణించింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.580 కోట్ల నుంచి రూ.513 కోట్లకు పడిపోయినట్లు బీఎస్‌ఈకి సమాచారం అందించింది. హెపటైటిస్‌ సీ అమ్మకాలు అంతకంతకు పడిపోవడంతో మార్జిన్లపై ప్రభావం చూపాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. అలాగే రూ.2 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ. 3.50 మధ్యంతర డివిడెండ్‌ను సంస్థ ప్రకటించింది. ఈ ఏడాది ఇలా డివిడెండ్‌ ప్రకటించడం ఇది మూడోసారి. స్టాక్‌ మార్కెట్‌ ముగిసే సమయానికి కంపెనీ షేరు ధర స్వల్పంగా తగ్గి రూ. 712 వద్ద ముగిసింది. 


logo