న్యూఢిల్లీ, మే 13: లుపిన్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన 3 నెలల కాలానికిగాను సంస్థ రూ.460 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం నమోదైన రూ.390 కోట్లతో పోలిస్తే 18 శాతం అధికం. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.3,846 కోట్ల నుంచి రూ.3,783 కోట్లకు తగ్గింది. గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.15,163 కోట్ల ఆదాయంపై రూ.1,216 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని నమోదు చేసుకున్నది. మరోవైపు రూ.2 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.6.5 డివిడెండ్‌ను కంపెనీ బోర్డు ప్రతిపాదించింది.