బుధవారం 05 ఆగస్టు 2020
Business - Jul 28, 2020 , 00:23:23

టెక్‌ మహీంద్రా లాభం 972 కోట్లు

టెక్‌ మహీంద్రా లాభం 972 కోట్లు

న్యూఢిల్లీ, జూలై 27: దేశంలో ఐదో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టెక్‌ మహీంద్రా గత త్రైమాసికానికిగాను రూ.972.30 కోట్ల ఏకీకృత లాభాన్ని గడించింది. 2018-19 ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.959.30 కోట్ల లాభంతో పోలిస్తే 1.4 శాతం పెరిగింది. ఏడాది క్రితం రూ.8,653 కోట్లుగా ఉన్న ఆదాయం గత త్రైమాసికానికిగాను 5.2 శాతం పెరిగి రూ.9,106 కోట్లుగా నమోదైంది. ప్రతి షేరుపై రూ.11.07 ఆర్జించినట్లు అయింది.  గత త్రైమాసికం ముగిసేనాటికి సంస్థలో 1,23,416 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, అంతక్రితం త్రైమాసికంతో పోలిస్తే 1,820 మంది తగ్గారు. 

హ్యావెల్స్‌ లాభంలో క్షీణత

హ్యావెల్స్‌ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్‌ 30తో ముగిసిన మూడు నెలలకుగాను సంస్థ రూ.63.98 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం నమోదైన రూ.177.23 కోట్లతో పోలిస్తే 64 శాతం తగ్గింది. సమీక్షకాలంలో ఆదాయం ఏడాది ప్రాతిపదికన 45 శాతం తగ్గి రూ. 1,515.56 కోట్లకు పరిమితమైందని కంపెనీ సీఎండీ అనిల్‌ రాయ్‌ గుప్తా తెలిపారు. 


logo