శనివారం 28 మార్చి 2020
Business - Feb 22, 2020 , 03:34:35

వేలానికి నీరవ్‌ ఆస్తులు

వేలానికి నీరవ్‌ ఆస్తులు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ)ను నిట్టనిలువునా ముంచి దేశం నుంచి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీకి చెందిన విలాసవంతమైన కార్లు, విలువైన కళాఖండాలు, ఇతర ఆస్తులను త్వరలో వేలం వేయనున్నారు. ఇందుకోసం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) శాఫ్రాన్‌ఆర్ట్‌ ఆక్షన్‌ హౌస్‌ (వేలం సంస్థ)ను రంగంలోకి దించింది. ఈ వేలాన్ని రెండు విడుతల్లో (ఈ నెల 27న లైవ్‌ ఆక్షన్‌, మార్చి 3, 4 తేదీల్లో ఆన్‌లైన్‌ ఆక్షన్‌) నిర్వహించనున్నారు. పీఎన్‌బీ కుంభకోణంపై దర్యాప్తులో భాగంగా నీరవ్‌మోదీ నుంచి స్వాధీనం చేసుకొన్న ఓ రోల్స్‌ రాయిస్‌ కారు (అంచనా విలువ రూ.75 లక్షల నుంచి రూ.95 లక్షలు), పోర్షే పనమెరా ఎస్‌ కారు (రూ.2.13 కోట్లు), ‘బ్యాటిల్‌ ఆఫ్‌ గంగా అండ్‌ జమున: మహాభారత’ పేరుతో ప్రఖ్యాత చిత్రకారుడు ఎంఎఫ్‌ హుస్సేన్‌ 1972లో గీసిన ఆయిల్‌ పెయింటింగ్‌ (రూ.12 కోట్ల నుంచి రూ.18 కోట్లు) తదితర కళాఖండాలు, విలువైన వాచీలు వేలం వేయనున్నారు.


logo