బుధవారం 03 జూన్ 2020
Business - Apr 10, 2020 , 23:42:26

రియల్‌కు లక్ష కోట్ల నష్టం

రియల్‌కు లక్ష కోట్ల నష్టం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కొవి డ్‌-19 మహమ్మారి కారణంగా దేశీయ రియల్‌ ఎస్టేట్‌ రంగానికి  దాదాపు లక్ష కోట్ల రూపాయల నష్టం సంభవించింది. దేశంలోని అన్ని రంగాల్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు జీడీపీలో కనీసం 10 శాతం సొమ్మును ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ కింద ప్రకటించాలని నరెడ్కో కేంద్రాన్ని కోరింది. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడితేనే భవిష్యత్తులో నిలదొక్కుకోగలుగుతామని నరెడ్కో అధ్యక్షుడు నిరంజన్‌ హీరానందానీ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత సమయంలో ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాలని సూచించారు.  

ఇండ్ల ధరల నియంత్రణ

దేశంలో ఇండ్ల ధరను నియంత్రించాల్సిన అవసరముందని ఆర్బీఐ తాజా అధ్యయనం తెలియజేసింది. ఎన్సీఆర్‌తోపాటు ముంబై వంటి నగరాల్లో ఐదు శాతం ఇండ్ల రేట్లు తగ్గుముఖం పట్టాయని, దక్షిణాది రాష్ర్టాల్లో మాత్రం రేటు సుమారు 16 శాతం పెరిగిందని అభిప్రాయపడింది. 


logo