శనివారం 30 మే 2020
Business - May 05, 2020 , 01:07:14

తెరుచుకున్న నవభారత్‌ ప్లాంట్‌

తెరుచుకున్న నవభారత్‌ ప్లాంట్‌

హైదరాబాద్‌, మే 4: లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రంలో మూతపడిన ప్లాంట్‌ను తెరిచినట్లు నవ భారత్‌ వెంచర్‌ లిమిటెడ్‌ వెల్లడించింది. ఖమ్మం జిల్లాలోని పాల్వంచ వద్ద ఏర్పాటు చేసిన పవర్‌, ఫెర్రో అల్లోయస్‌ ప్లాంట్‌లో తిరిగి సోమవారం నుంచి ఉత్పత్తిని ప్రారంభించినట్లు సంస్థ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. ఈ ప్లాంట్‌తోపాటు ఒడిశాలో ఉన్న ప్లాంట్‌లో ఉత్పత్తిని స్టార్ట్‌ చేసింది. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పరిమితులతో అనుమతులు పొందిన తర్వాత తిరిగి ప్రారంభించినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. 


logo