ఆదివారం 24 మే 2020
Business - Feb 12, 2020 , 23:58:11

13 లక్షల కోట్లు

13 లక్షల కోట్లు
  • ఈ ఏడాది దేశీయ ఐటీ రంగం ఆదాయం నాస్కామ్‌ అంచనా

ముంబై, ఫిబ్రవరి 12:ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి ఐటీ, అనుబంధ సంస్థల ఆదాయం 192 బిలియన్‌ డాలర్లకు చేరుకోనున్నదని నాస్కామ్‌ అంచనావేస్తున్నది. మన కరెన్సీలో ఇది రూ.13 లక్షల కోట్లకు పైమాటే.  వరుసగా రెండు దశాబ్దాలకు పైగా ఆదాయం ముందస్తు అంచనాలను విడుదల చేసిన నాస్కామ్‌ ..గతేడాది మాత్రం నిలిపివేసింది.  నాస్కామ్‌ లీడర్‌షిప్‌ ఫోరం సమావేశంలో నాస్కామ్‌ చైర్మన్‌ కేశవ్‌ మురుగేశ్‌ మాట్లాడుతూ..2019-20లో సాఫ్ట్‌వేర్‌, బిజినెస్‌ ప్రాసెస్‌ మేనేజ్‌మెంట్‌ ఇండస్ట్రీ 8.4 శాతం వృద్ధితో 192 బిలియన్‌ డాలర్లకు చేరుకోనున్నదని తెలిపారు. ఈ ఏడాది కొత్తగా 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని, దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 43.60 లక్షలకు చేరుకున్నారు. ఐటీ రంగం భవిష్యత్తుపై ఆశావాదంగా ఉన్న నాస్కామ్‌..వచ్చే ఏడాదిలో 43 లక్షల మంది ఉద్యోగులకు నైపుణ్యంలో శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని వెల్లడించింది. కరోనా వైరస్‌తో ఐటీ రంగంపై ఎంతమేర ప్రభావం పడనున్నదో ఇంతవరకు స్పష్టత రాలేదని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి.
logo