గురువారం 03 డిసెంబర్ 2020
Business - Oct 24, 2020 , 13:49:09

చందాకొచ్చ‌‌ర్ భ‌ర్త‌కు ముంబై కోర్టులో నిరాశ‌

చందాకొచ్చ‌‌ర్ భ‌ర్త‌కు ముంబై కోర్టులో నిరాశ‌

ముంబై: ఐసీఐసీఐ-వీడియోకాన్ రుణ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ బ్యాంకు మాజీ సీఈఓ చందాకొచ్చ‌‌ర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గత నెలలో చందాకొచర్ భర్త దీపక్ కొచ్చర్‌ను అరెస్టు చేసింది. అయితే ఇటీవల కరోనా బారిన పడిన దీపక్ కొచర్ పోస్ట్ కోవిడ్ -19 చికిత్స నిమిత్తం అనుమతి కోరుతూ పెట్టుకున్న విజ్ఞప్తిని ముంబైలోని ప్రత్యేక కోర్టు తోసిపుచ్చింది.

కాగా, ముంబైలోని తలోజా జైలులో ఉన్న దీప‌క్ కొచ్చ‌ర్‌కు ఇటీవ‌ల కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది. దాంతో కోర్టు ఆదేశాల మేరకు ఆయ‌న ఆస్ప‌త్రిలో చికిత్స పొందారు. ప్ర‌స్తుతం కోలుకున్న దీప‌క్ కొచ్చ‌ర్‌కు మ‌రింత మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చాలని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు విజ్ఞ‌ప్తి చేశారు. అయితే ఆ విజ్ఞప్తిని ప్రత్యేక న్యాయమూర్తి ప్రశాంత్ పీ రాజవైద్య తోసిపుచ్చారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.