ఆదివారం 09 ఆగస్టు 2020
Business - Jul 23, 2020 , 16:01:25

ప్రపంచంలో అత్యంత విలువైన 50 కంపెనీల్లో ఒకటిగా రిలయన్స్‌

ప్రపంచంలో అత్యంత విలువైన 50 కంపెనీల్లో ఒకటిగా రిలయన్స్‌

న్యూఢిల్లీ: ముఖేష్ అంబానీ తన కిరీటంలో మరో తురాయి వచ్చి చేరింది. అతడి ఆధ్వర్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (రిల్‌) ఇప్పుడు ప్రపంచంలో అత్యంత విలువైన 50 కంపెనీలలో ఒకటిగా నిలిచింది. రిల్‌ షేర్లు 2.30 శాతం పెరిగి గరిష్ఠంగా రూ.2,050 ను తాకింది. దీంతో రిల్‌ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.13 లక్షల కోట్లకు చేరుకున్నది. డాలర్ పరంగా ఇది 173 బిలియన్ డాలర్లతో సమానం. ప్రస్తుతం 171.9  బిలియన్‌ డాలర్లతో 50 వ స్థానంలో ఉన్న ఒరాకిల్ కార్పొరేషన్ ను వెనక్కి నెట్టి ఆ స్థానాన్ని ఆక్రమించింది.

గత ఒక నెలలో నిఫ్టీ యొక్క 8.72 శాతం కదలికతో పోల్చితే, రిల్‌ షేర్లు 18.40 శాతంగా ర్యాలీగా ఉన్నాయి. కంపెనీ తన జియో ప్లాట్‌ఫామ్‌లలో మూడు నెలల్లోపు రూ.1.50 లక్షల కోట్ల పెట్టుబడులను సమీకరించగలిగింది. తాజాగా ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ రూ.33,737 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది.

4 జీ / 5 జీ నెట్‌వర్క్‌కు వలస వెళ్లాలనుకునే 2 జీ కస్టమర్ల కోసం గూగుల్ సహకారంతో తక్కువ ఖర్చుతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను అభివృద్ధి చేయాలని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలో 5 జీ నెట్‌వర్క్ రోల్ అవుట్ కోసం కంపెనీ తన అంతర్గత 5 జీ సొల్యూషన్‌ను అభివృద్ధి చేసింది. సరికొత్త 5 జీ సాంకేతిక పరిజ్ఞానం ట్రయల్స్‌ నిర్వహించడానికి టెలివిజన్ విభాగం నుంచి కొన్ని ఫ్రీక్వెన్సీలలో జియోకు స్పెక్ట్రం ఉండాలి. జియో త్వరలో తన మొబైల్ నెట్‌వర్క్‌లో 400 కోట్ల మంది చందాదారులను తన కొత్త ఉత్పత్తుల ద్వారా పొందగలదని విశ్లేషకులు భావిస్తున్నారు.


logo