ఆదివారం 07 మార్చి 2021
Business - Jan 09, 2021 , 17:07:28

టాప్‌-10 నుంచి ముకేశ్ మ‌రింత డౌన్‌

టాప్‌-10 నుంచి ముకేశ్ మ‌రింత డౌన్‌

న్యూఢిల్లీ: ప్ర‌పంచ‌ సంప‌న్ను జాబితాలో భార‌తీయ కుబేరుడు ముకేశ్ అంబానీ స్థానం మ‌రింత దిగజారింది. రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ చైర్మ‌న్ అండ్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ ముకేశ్ అంబానీ.. ప్ర‌పంచ సంప‌న్నుల్లో 13వ వ్య‌క్తిగా నిలిచార‌ని బ్లూమ్‌బ‌ర్గ్ బిలియ‌నీర్ ఇండెక్స్ తెలిపింది. ప్ర‌స్తుతం ఆయ‌న ఆస్తి సుమారు రూ.6.62 ల‌క్ష‌ల కోట్ల (90 బిలియ‌న్ డాల‌ర్లు) నుంచి రూ.5.36 ల‌క్ష‌ల కోట్ల (73.4 బిలియ‌న్ డాల‌ర్లు)కు ప‌డిపోయింది. రిల‌య‌న్స్ షేర్లు 52 వారాల గ‌రిష్ఠం నుంచి 18 శాతం ప‌డిపోవ‌డంతో ఆ సంస్థ మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ త‌గ్గిపోయింది.  

గ‌తేడాది ఆగ‌స్టులో బ్లూమ్‌బ‌ర్గ్ బిలియ‌నీర్ ఇండెక్స్‌లో ప్ర‌పంచ సంప‌న్నుల్లో ముకేశ్ అంబానీ నాలుగో వ్య‌క్తిగా నిలిచారు. కానీ ఇటీవ‌ల రిల‌య‌న్స్ షేర్ విలువ ప‌త‌నం కావ‌డంతో ముకేశ్ అంబానీ నిక‌ర సంప‌ద కూడా త‌గ్గిపోయింది. ఫ్యూచ‌ర్ గ్రూప్ హోల్‌సేల్ ఆస్తుల‌ను కొనుగోలు ప్ర‌క‌ట‌న‌తో ఆల్ టైం హై రూ.2,369 నుంచి రిల‌య‌న్స్ షేర్ సుమారు 14 నుంచి 18.3 శాతానికి ప‌డిపోయింది. టెలికం, రిటైల్ రంగాల్లో వాటాల విక్ర‌యంతో రిల‌య‌న్స్ షేర్ విలువ గ‌తేడాది మార్చిలో అత్య‌ల్ప స్థాయి విలువ రూ.867.82 నుంచి 128 శాతం, 2020లో 32.2 శాతం ల‌బ్ది పొందింది. ఫ్యూచ‌ర్స్ గ్రూప్ కొనుగోలు ఒప్పందాన్ని ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్ స‌వాల్ చేయ‌డంతో రిల‌య‌న్స్ ప‌త‌నం మొద‌లైంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo