గురువారం 06 ఆగస్టు 2020
Business - Jul 11, 2020 , 02:15:40

బఫెట్‌ను దాటేసిన ముకేశ్‌

బఫెట్‌ను దాటేసిన ముకేశ్‌

  • ప్రపంచ కుబేరుల జాబితాలో ఎనిమిదో స్థానానికి ఆర్‌ఐఎల్‌ చైర్మన్‌

న్యూఢిల్లీ, జూలై 10: దేశీయ కుబేరుడు ముకేశ్‌ అంబానీ మరో రికార్డును సొంతం చేసుకున్నారు. ప్రపంచ కుబేరుల జాబితాలో వారెన్‌ బఫెట్‌ను వెనక్కినెట్టి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ఎనిమిదో స్థానాన్ని దక్కించుకున్నారు. 68.3 బిలియన్‌ డాలర్ల సంపదతో ఆయన ఈ స్థానాన్ని సొంతం చేసుకున్నారని బ్లూంబర్గ్‌ తాజా నివేదికలో వెల్లడించింది.   67.9 బిలియన్‌ డాలర్ల ఆస్తితో బఫెట్‌ ర్యాంక్‌ తొమ్మిదో స్థానానికి పడిపోయింది. ఒకవైపు కరోనా వైరస్‌తో ప్రపంచం కుదేలవుతున్న ప్రస్తుత తరుణంలో రిలయన్స్‌ అనుబంధ సంస్థ టెలికం వెంచర్‌ జియాలో వాటా విక్రయానికి అనూహ్య స్పందన రావడంతో ఆయన ఆస్తి పెరుగడానికి దోహదం చేసింది. ప్రస్తుత సంవత్సరంలో రిలయన్స్‌ను అప్పులు లేని సంస్థగా తీర్చిదిద్దడంలో భాగంగా జియోలో 25 శాతం వరకు వాటాను విక్రయించడంతో లక్ష కోట్ల రూపాయలకు పైగా సమకూరాయి. దీంతో మార్చి నుంచి ఇప్పటి వరకు కంపెనీ షేరు ధర రెండు రెట్లు కంటే అధికంగా లాభపడింది. దీంతో ఆయన  ప్రపంచ కుబేరుల టాప్‌-10 జాబితాలో ఆసియా నుంచి ఒకే ఒక్కడు ముకేశ్‌ ఉండటం గమనార్హం. 89 ఏండ్ల వయస్సు కలిగిన బఫెట్‌..2006 నుంచి  ఇప్పటి వరకు 37 బిలియన్‌ డాలర్ల విలువైన బెర్క్‌షైర్‌ హాథవే షేర్లను విరాళంగా ఇచ్చారు.  logo