బుధవారం 30 సెప్టెంబర్ 2020
Business - Aug 08, 2020 , 18:53:35

ప్ర‌పంచ కుబేరుల్లో 4వ స్థానానికి ముకేశ్‌

ప్ర‌పంచ కుబేరుల్లో 4వ స్థానానికి ముకేశ్‌

ముంబై: దేశంలోనే అత్యంత ధ‌న‌వంతుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్‌ అంబానీ మరో  మైలురాయిని అధిగమించారు. ప్రపంచం కుబేరుల‌ జాబితాలో ఆయన మరో మెట్టు పైకెక్కారు. బ్లూమ్‌బెర్గ్‌‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ప్రకారం.. ముకేశ్ అంబానీ 80.6 బిలియన్‌ డాలర్ల నికర సంపదతో ఫ్రాన్స్‌కు చెందిన బ‌డా పారిశ్రామిక‌వేత్త‌‌ బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను వెన‌క్కినెట్టి నాలుగో స్థానం ద‌క్కించుకున్నారు.   

కాగా, ముకేశ్ అంబానీ ఇప్పటికే ఎలాన్‌ మస్క్‌, సెర్జె బ్రిన్‌, ల్యారీ పేజ్‌, వారెన్‌ బఫెట్ లాంటి దిగ్గజాలను దాటేశారు. ప్రస్తుతం ప్ర‌పంచ సంప‌న్నుల‌ జాబితాలో అమెజాన్‌ అధిపతి జెఫ్‌ బెజోస్‌ 187 బిలియన్‌ డాలర్ల సంపదతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. బిల్‌గేట్స్‌ 121 బిలియన్‌ డాలర్లతో రెండో స్థానంలో, ఫేస్‌బుక్‌ అధిపతి మార్క్‌ జుకర్‌ బర్గ్ 102 బిలియన్‌ డాలర్ల సంప‌ద‌తో‌ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఇక‌ ఆర్నాల్ట్‌ 80.2 బిలియన్‌ డాలర్లతో ఐదో స్థానానికి పరిమితమయ్యారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo