కొన్ని సినిమాలు ప్రకటించిన తర్వాత చాలా రోజుల వరకు అస్సలు ముందుకు కదలవు. అలాంటి సినిమానే అల్లు అర్జున్ ఐకాన్. ఈ చిత్రం ప్రకటించి రెండు సంవత్సరాలు దాటిపోయింది. కానీ ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి ముచ్చట లేదు. మధ్యలో పవన్ కళ్యాణ్ హీరోగా వకీల్ సాబ్ సినిమా చేశాడు వేణు శ్రీరామ్. మరోవైపు అల్లు అర్జున్ కూడా వేరే సినిమాలతో బిజీగా గడిపేస్తున్నాడు. సుకుమార్‌తో పుష్ప సినిమా చేస్తున్నాడు. కానీ అల వైకుంఠపురంలో సినిమాకు ముందు ప్రకటించిన ఐకాన్ మాత్రం ముందకు కదల్లేదు. దీంతో ఈ సినిమా ఆగిపోయిందనే ప్రచారం కూడా జరిగింది. కానీ అందులో నిజం లేదని నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చాడు.
ప్రస్తుతం పుష్ప సినిమాతో బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్. ఈ సినిమా తర్వాత మరో రెండు ప్రాజెక్టులు కూడా ఈయన చేతిలో ఉన్నాయి. వరస సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చి వాటికి డేట్స్ అడ్జస్ట్ చేసే పనిలో ఉన్నాడు బన్నీ. ఈ క్రమంలోనే పుష్ప సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు. అయితే ఈ సినిమాను ఒకటి కాదు రెండు భాగాలుగా పూర్తి చేయనున్నాడు దర్శకుడు సుకుమార్. తొలిభాగం డిసెంబర్ 24న విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండో భాగం కూడా వెంటనే పూర్తి చేస్తారా లేదంటే మధ్యలో మరో సినిమా ఏదైనా బన్నీ ఒప్పుకుంటాడా అనేది ఆసక్తికరంగా మారింది. పుష్ప సినిమా తర్వాత వేణు శ్రీరామ్ ఐకాన్.. ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమాకు కమిట్ మెంట్ ఇచ్చాడు అల్లు అర్జున్. ఇందులో ఐకాన్ సినిమాకు బలం ఉందో లేదో తెలియదు కానీ ప్రశాంత్ నీల్ సినిమాను మాత్రం చాలా వేగంగా పూర్తి చేయాలని చూస్తున్నాడు అల్లు అర్జున్.
ఇదిలా ఉంటే ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఐకాన్ సినిమాకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. నిర్మాత దిల్ రాజు కూడా ఈ చిత్రం విషయంలో వేణుకు పూర్తి ఫ్రీ డమ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ విషయంలోనే రాజు, వేణు మధ్య దూరం పెరగడంతో సినిమాను ఆపేయాలని అనుకుంటున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు అవేం లేవు. తన స్క్రిప్టుతో దిల్ రాజును పడేశాడు వేణు శ్రీరామ్. దాంతో వీలైనంత త్వరగానే ఐకాన్ పట్టాలెక్కడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ సినిమాలో అంధుడిగా అల్లు అర్జున్ నటించబోతున్నట్లు తెలుస్తుంది. అందుకే ట్యాగ్ లైన్ కూడా కనబడుట లేదు అని ఫిక్స్ చేసారు. ఏదేమైనా ఐకాన్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలని అభిమానులు కూడా ఆసక్తిగా వేచి చూస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
100 సార్లు నన్ను రిజెక్ట్ చేశారు..వారికి నా సమాధానమదే: దివి
రాజమౌళి సినిమాకు పని చేసినా పేరు రాదు.. రామ్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్లో నయా ట్రెండ్.. ఫిట్ నెస్ రీల్స్ చుట్టూ తెలుగు స్టార్స్
మా ఎన్నికలు..ప్రకాశ్ రాజ్ ప్రశ్నకు నరేశ్ సెటైరికల్ రిప్లై
నో ఓటీటీ..సిల్వర్ స్క్రీన్ పైనే ‘నారప్ప’ సందడి..!
ఈ వీకెండ్ నెట్‌ఫ్లిక్స్ లో వస్తున్న తెలుగు సినిమాలివే..!
బంగార్రాజు చిత్రంలో ‘బేబమ్మ’..?