హైదరాబాద్, సెప్టెంబర్ 13: న్యూక్లియర్ ఎనర్జీ, రక్షణ, ఏరోస్పెస్ రంగానికి చెందిన విడిభాగాల తయారీ సంస్థ ఎంటీఏఆర్ అతిపెద్ద ఆర్డర్‌ను చేజిక్కించుకున్నది. అమెరికాకు చెందిన బ్లూమ్ ఎనర్జీ నుంచి 29.82 మిలియన్ డాలర్లు ఎగుమతి ఆర్డర్ లభించినట్లు కంపెనీ ఒక ప్రకటనలలో వెల్లడించింది. మన కరెన్సీలో ఇది రూ.220 కోట్లు. కంపెనీ చరిత్రలో ఇంత పెద్ద ఆర్డర్ రావడం కూడా ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ ఆర్డర్లో భాగంగా యుమా హాట్ బాక్సెస్తోపాటు దీనికి సంబంధించిన విడిభాగాలను బ్లూమ్ ఏనర్జీకి వచ్చే ఏడాది చివరిలోగా డెలివరీ చేయాల్సి ఉంటుందని పేర్కొంది.