సోమవారం 18 జనవరి 2021
Business - Dec 01, 2020 , 02:25:49

మోటరోలా 5జీ ఫోన్‌

మోటరోలా 5జీ ఫోన్‌

  • ధర రూ.20,999

న్యూఢిల్లీ: భారత్‌లో ఐదో తరం (5జీ) టెలికం నెట్‌వర్క్‌ ఇంకా అందుబాటులోకి రాకపోయినప్పటికీ దేశీయ మార్కెట్లోకి 5జీ స్మార్ట్‌ఫోన్ల రాక క్రమంగా పెరుగుతున్నది. ప్రముఖ కంపెనీ మోటరోలా ‘మోటో జీ’ సిరీస్‌లో ఇటీవల తొలుత యూరప్‌ మార్కెట్లో ప్రవేశపెట్టిన 5జీ స్మార్ట్‌ఫోన్‌ను శుక్రవారం భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో హెడ్‌డీఆర్‌ 10 సపోర్ట్‌ కలిగిన 6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లేతోపాటు క్వా ల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 750 జీ ప్రాసెసర్‌ను, 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అమర్చింది. వెనుకవైపు మూడు కెమేరాలు (48+8+ 2 ఎంపీ), ముందువైపు పంచ్‌ హోల్‌ డిజైన్‌తో 16 ఎంపీ సెల్ఫీ కెమేరా, ఎన్‌ఎఫ్‌సీ, 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ఆప్షన్‌ తదితర ఫీచర్లతో వాల్కానిక్‌ గ్రే, ఫ్రాస్టెడ్‌ సిల్వర్‌ రంగుల్లో లభ్యమయ్యే ఈ ఫోన్‌ ధరను రూ.20,999గా నిర్ణయించింది. ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే అందుబాటులో ఉండే ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఎస్బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌ కార్డులతో కొలుగోలు చేసేవారికి 5 శాతం క్యాష్‌బ్యాక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కార్డులతో కొనుగోలు చేసేవారికి రూ.1000 డిస్కౌంట్‌ లభిస్తుంది.