బుధవారం 03 జూన్ 2020
Business - May 04, 2020 , 02:22:46

బెంగళూరులోవ్యాపారాలు షురూ

బెంగళూరులోవ్యాపారాలు షురూ

బెంగళూరు, మే 3: సోమవారం నుంచి బెంగళూరులో పలు వ్యాపారాలు మొదలవుతున్నాయి. పరిమిత సిబ్బందితో దుకాణాలను తెరుచుకోవచ్చని కేంద్ర హోంశాఖ అనుమతివ్వడంతో కర్ణాటక ప్రభుత్వం వివిధ వ్యాపార లావాదేవీల నిర్వహణకు షరతులతో ఆమోదముద్ర వేసింది. అయితే రెడ్‌జోన్లలో మాత్రం అన్ని దుకాణాలు ఈ నెల 17దాకా బంద్‌ కానున్నాయి. మరోవైపు మూడో విడుత లాక్‌డౌన్‌లో దుకాణం తెరువాలా?.. వద్దా?.. అని వ్యాపారులు అయోమయంలో పడ్డారు. ఏ వ్యాపారానికి అనుమతి ఉంది?.. లేదు?.. అన్నదానిపై స్పష్టత లేకపోవడమే ఇందుకు కారణం. దీంతో కేంద్రం నుంచి వర్తక సంఘాలు స్పష్టత కోరుతున్నాయి.


logo