మంగళవారం 09 మార్చి 2021
Business - Jan 29, 2021 , 00:44:40

మరిన్ని కరోనా వ్యాక్సిన్లు

మరిన్ని కరోనా వ్యాక్సిన్లు

  • త్వరలోనే భారత్‌ నుంచి వస్తాయ్‌: మోదీ

న్యూఢిల్లీ, జనవరి 28: కరోనా వైరస్‌పై చేస్తున్న పోరులో ప్రపంచానికి భారత్‌ నుంచి మరిన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇప్పటికే రెండు వ్యాక్సిన్లను దేశీయ ఔషధ రంగ సంస్థలు తెచ్చాయని గుర్తుచేశారు. గురువారం వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం దావోస్‌ ఆన్‌లైన్‌ సమావేశాల్లో మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా మహమ్మారి అంతంలో భారత్‌ కీలకపాత్ర పోషించగలదన్న ఆయన ఈ క్రమంలోనే మరిన్ని కొవిడ్‌-19 వ్యాక్సిన్లు భారత్‌ నుంచి ఆవిష్కృతం కాబోతున్నాయని చెప్పారు. కాగా, కరోనా ప్రభావం నుంచి వేగంగా కోలుకుంటున్న భారత ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు కావాలని గ్లోబల్‌ ఇండస్ట్రీని మోదీ కోరారు. దేశంలో ఎన్నో వ్యాపారావకాశాలున్నాయని, అందిపుచ్చుకోవాలని సూచించారు. నిజానికి గతేడాది కరోనాతో భారత్‌ చిన్నాభిన్నమవుతుందన్న అంచనాలు వచ్చాయని, కానీ మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొని విజయం సాధించామన్నారు.

VIDEOS

logo