శనివారం 31 అక్టోబర్ 2020
Business - Sep 30, 2020 , 03:28:27

అదనపు రుణాల సమీకరణలో రాష్ర్టాలకు మరింత వెసులుబాటు

అదనపు రుణాల సమీకరణలో రాష్ర్టాలకు మరింత వెసులుబాటు

  • గడువును ఆరు నెలలు పొడిగించిన ఆర్బీఐ

ముంబై: మార్కెట్‌ రుణాలు, ఓవర్‌డ్రాఫ్ట్‌ సదుపాయం ద్వారా నిధులను సమీకరించునేందుకు రాష్ర్టాలకు ఇచ్చిన అదనపు వెసులుబాటును రిజర్వు బ్యాంకు మరింత పొడిగించింది. కరోనా సంక్షోభంతో ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి అధిగమించడంలో రాష్ర్టాలకు చేయూతనిచ్చేందుకు ఈ చర్య చేపట్టింది. కొవిడ్‌-19 సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్‌లో ఆర్బీఐ రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు నిధుల సమీకరణలో అదనపు వెసులుబాటును కల్పించిన విషయం తెలిసిందే. ఈ నెల 30తో ముగియనున్న గడువును మరో ఆరు నెలలు పొడిగించినట్టు ఆర్బీఐ ప్రకటించింది.