మంగళవారం 26 మే 2020
Business - Apr 19, 2020 , 23:53:26

ఐటీ రిటర్ను ఫారాల సవరణ

ఐటీ రిటర్ను ఫారాల సవరణ

న్యూఢిల్లీ: ఆదాయం పన్ను (ఐటీ) రిటర్ను ఫారాలను సవరిస్తున్నామని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఆదివారం తెలిపింది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాట్లు, ప్రయోజనాలను పన్ను చెల్లింపుదారులకు కల్పించాలనే 2019-20 ఆర్థిక సంవత్సరం కోసం ఫారాలను సవరిస్తున్నట్లు చెప్పింది. కొత్త ఫారాలను ఈ నెలాఖర్లోగా ప్రకటిస్తామని, మే 31లోగా రిటర్న్‌ ఫైలింగ్‌ సదుపాయం అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేసింది. ఐటీ చట్టం 1961 కింద వివిధ కాలపరిమితులను కేంద్ర ప్రభుత్వం పొడిగించిన విషయం తెలిసిందే.


logo