శనివారం 30 మే 2020
Business - Apr 13, 2020 , 13:24:55

మొబైల్ ఏటీఎం స‌ర్వీస్‌

మొబైల్ ఏటీఎం స‌ర్వీస్‌

ముంబై: దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతున్న క్ర‌మంలో ప్ర‌జ‌లంద‌రూ ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. ముఖ్యంగా మ‌హారాష్ట్ర‌లో క‌రోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు త‌లెత్త‌కుండా డ‌బ్బులు డ్రా చేసుకోవాల‌నుకునే వారికి మొబైల్ ఏటీఎం స‌ర్వీసుల‌ను ప‌లు  బ్యాంకులు ప్రారంభించాయి. ముంబైలో హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకులు ఈ సేవ‌ల్ని ప్రారంభించాయి. మొబైల్ ఏటీఎం వ్యాన్ ఒక ప్రాంతం నుంచి మ‌రో ప్రాంతానికి ప్ర‌యాణిస్తూ ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ముంబై, నోయిడా ప్రాంతాల్లో దీనిని ప్రారంభించ‌గా..త్వ‌ర‌లో దేశ‌వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానుంది. అటు వ‌చ్చే వారం నుంచి తాము కూడా మొబైల్ ఏటీఎం సేవ‌లు ప్రారంభిస్తామ‌ని ఐసీఐసీఐ బ్యాంకు తెలిపింది.


logo